అన్వేషించండి

Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..

NPS Rules | సురక్షిత పెట్టుబడితో అధిక రాబడి కావాలని చూస్తున్నారా.. అయితే FD కంటే ఎక్కువ లాభం అందించే ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. ఇన్వెస్ట్ చేసి మీరు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు.

Fixed Deposits | భారత్‌లో చాలా మంది ఇప్పటికీ ఇన్వెస్ట్మెంట్ కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)ని అత్యంత సురక్షితమైన ఛాయిస్ అని భావిస్తారు. బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసి, నిర్ణీత సమయం తర్వాత వడ్డీ తిరిగి పొందుతారు. తక్కువ రిస్క్ ఉండటంతో ప్రజలు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌ను పక్కనపెట్టి.. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో నగదు పెడుతుంటారు. కానీ గత కొన్ని సంవత్సరాలలో FDలపై వడ్డీ చాలా మంది కోరుకునేలా రావడం లేదనేది గ్రహించాలి. ఈ పరిస్థితిలో చాలా మంది ఎక్కువ బెనిఫిట్స్ పొందాలనే కోరికతో రిస్క్ ఉన్న పెట్టుబడులపై ఫోకస్ చేస్తున్నారు.

అయితే ఆ పెట్టుబడుల కారణంగా మీ డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం కొన్ని పథకాలను తీసుకురాగా, ఇవి సురక్షితమైనవి. చాలా సందర్భాల్లో FDల కంటే మెరుగైన వడ్డీ, రాబడిని అందిస్తాయి. ఈ పథకాలలో దీర్ఘకాలంలో మంచి ప్రయోజనం పొందవచ్చు. మీరు మనీ సెక్యూరిటీతో పాటు మంచి రాబడి పొందాలనుకుంటే, ఈ ప్రభుత్వ పెట్టుబడి పథకాల గురించి తెలుసుకుంటే మీకు ప్రయోజనం.  

RBI ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ 

మీరు భద్రతతో పాటు మంచి వడ్డీ ఉన్న పెట్టుబడిని కోరుకుంటే, RBI ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్‌ను కూడా పరిశీలించవచ్చు. ఇవి నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా జారీ అవుతాయి. ఇందులో పెట్టుబడి చాలా సురక్షితమైనదిగా భావిస్తారు. ఈ బాండ్ల ప్రత్యేకత ఏమిటంటే, వాటి వడ్డీ రేటు ఎప్పటికప్పుడు మారవచ్చు.

దీనివల్ల పెట్టుబడిదారులు ప్రస్తుత మార్కెట్ ప్రకారం ప్రయోజనం పొందవచ్చు. ఈ బాండ్లపై దాదాపు 8.05 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఇది చాలా బ్యాంక్ FDల కంటే ఎక్కువ. ఇందులో పెట్టుబడి పెట్టే ప్రక్రియ కూడా చాలా ఈజీ. దీనిని RBI రిటైల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

NPSలో మెరుగైన రిటైర్‌మెంట్ ఫండ్ 

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) అనేది ప్రభుత్వ రిటైర్‌మెంట్ స్కీమ్. ఇది ప్రధానంగా భవిష్యత్తులో ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ప్రభుత్వ బాండ్లు, ఈక్విటీ వంటి వివిధ ఆస్తులలో  పెట్టుబడి పెడతారు. దీనివల్ల దీర్ఘకాలంలో మెరుగైన రాబడి వచ్చే అవకాశముంది. NPS అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఇది రిటైర్‌మెంట్ కోసం బలమైన ఫండ్‌ను అందించడంలో మీకు సహాయపడుతుంది.

సాధారణంగా, NPSలో పెట్టుబడి పెట్టేవారు దాదాపు 8 శాతం వరకు సగటు రాబడిని పొందవచ్చు. 60 సంవత్సరాల తర్వాత, అందులో జమ చేసిన కొంత భాగాన్ని విత్‌గ్రా చేసుకోవచ్చు, అయితే మిగిలిన మొత్తాన్ని పెన్షన్ ఫండ్‌గా ఉపయోగిస్తారు. అలాగే, ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను (Income Tax) నిబంధనల ప్రకారం పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా లభిస్తుంది. 

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) కూడా ప్రభుత్వం అందించే  ప్రజాదరణ పొందిన పథకాల్లో ఒకటి. ఇది సురక్షితమైన,  స్థిరమైన రాబడిని కోరుకునే వారికి మంచిదని చెప్పవచ్చు. NSC సాధారణంగా 5 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటుంది. మీ పెట్టుబడిపై నిర్ణీత వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం ఈ పథకంపై దాదాపు 7.7 శాతం వడ్డీని అందిస్తున్నారు.

ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం (Tax Benefits) పొందవచ్చు. చిన్న మొత్తంతో పెట్టుబడిని ప్రారంభించే సౌలభ్యం దీన్ని సామాన్యులకు మరింత చేరువ చేస్తుంది. మీరు దీర్ఘకాలికంగా సురక్షితమైన పెట్టుబడితో పాటు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందాలనుకుంటే, NSC మంచి ఆప్షన్ కావొచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Personal Loan Death liability: పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే బ్యాంకులు నగదు ఎవరి నుంచి వసూలు చేస్తాయి ?
పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే బ్యాంకులు నగదు ఎవరి నుంచి వసూలు చేస్తాయి ?
Akshaya Tritiya 2026 : అక్షయ తృతీయకు బంగారం కొనాలనుకుంటున్నారా? గోల్డ్ ఇన్వెస్ట్​మెంట్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
అక్షయ తృతీయకు బంగారం కొనాలనుకుంటున్నారా? గోల్డ్ ఇన్వెస్ట్​మెంట్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
Digital Payments: యూపీఐ, బ్యాంక్ యూజర్లకు అలర్ట్! మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ గంట లేటు! కూలింగ్ పీరియడ్‌ అర్థమేంటి?
యూపీఐ, బ్యాంక్ యూజర్లకు అలర్ట్! మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ గంట లేటు! కూలింగ్ పీరియడ్‌ అర్థమేంటి?
Home Loan Interest Rates: హోమ్‌లోన్ వడ్డీ రేట్లు ఏ బ్యాంక్‌లో ఎంత ఉంది? ఈఎంఐ తగ్గించుకోవడానికి ఐదు చిట్కాలు తెలుసుకోండి!
హోమ్‌లోన్ వడ్డీ రేట్లు ఏ బ్యాంక్‌లో ఎంత ఉంది? ఈఎంఐ తగ్గించుకోవడానికి ఐదు చిట్కాలు తెలుసుకోండి!
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airforce Station: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
Deepika Padukone Pregnancy: మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
Chandrababu Birthday: చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
Peddi Special Song: మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
Meta Layoffs 2026: మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
Chittoor Leopard: చిత్తూరు నడిబొడ్డున చిరుత పులుల సంచారం.. స్పృహతప్పి గాయాలతో జనావాసాల మధ్య
చిత్తూరు నడిబొడ్డున చిరుత పులుల సంచారం.. స్పృహతప్పి గాయాలతో జనావాసాల మధ్య
Embed widget