అన్వేషించండి

IND vs NZ Pitch Update: T20 ప్రపంచ కప్‌ ఫైనల్లో 250 పరుగులు ఖాయమా? అహ్మదాబాద్ పిచ్ ఎవరికి ఎక్కువ ప్రయోజనం?

T20 World Cup Final: మార్చి 8న భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌లో అహ్మదాబాద్ పిచ్ ఏ జట్టుకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • T20 ప్రపంచ కప్ ఫైనల్: భారత్ లేదా న్యూజిలాండ్ చరిత్ర సృష్టించనుంది.
  • అహ్మదాబాద్ పిచ్ రెడ్, బ్లాక్ సాయిల్ మిశ్రమంతో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది.
  • భారత జట్టు యాజమాన్యం కోరిక మేరకు పిచ్‌ను సిద్ధం చేశారు.
  • కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పిచ్‌పై కాకుండా ఆటపై దృష్టి సారించారు.

T20 World Cup Final: మార్చి 8న చరిత్రకు సాక్ష్యంగా మారనుంది. వరుసగా రెండుసార్లు T20 ప్రపంచ కప్ గెలిచిన మొదటి దేశంగా భారత్‌ అవతరిస్తుంది లేదా న్యూజిలాండ్ మొదటిసారి టైటిల్‌ను కైవసం చేసుకుంటుంది. ఎవరు గెలిచినా, చరిత్ర పుస్తకాలకు కొత్త అధ్యాయం జోడించబడటం ఖాయం. అయితే, అహ్మదాబాద్ పిచ్ గురించి ఒక ప్రధాన అప్‌డేట్‌ వెలుగు చూసింది. 

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్‌ను రెడ్‌, బ్లాక్‌ సాయిల్‌ మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేస్తున్నట్లు ఒక మీడియా నివేదిక వెల్లడించింది . ఇది వాంఖడే స్టేడియంలో జరిగిన రెండో సెమీ-ఫైనల్‌లో భారత్‌-ఇంగ్లాండ్ మధ్య ఆడిన పిచ్‌ను పోలి ఉండవచ్చు. ఆ సెమీ-ఫైనల్‌లో, టీమ్ ఇండియా 253 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 246 పరుగులతో ప్రతిస్పందించింది.

అహ్మదాబాద్‌లోని పిచ్ ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. బౌలర్లు మంచి బౌన్స్‌ను పొందగలరు. ముందుగా బ్యాటింగ్ చేసే జట్టుకు 200 పరుగులు చేయడం కష్టమైన పని కాదు.

భారత్ లేదా న్యూజిలాండ్, ఎవరికి ఎక్కువ ప్రయోజనం?

నివేదికల ప్రకారం, గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీం ఇండియా మేనేజ్‌మెంట్ లీగ్ దశ మ్యాచ్‌లలో తమకు లభించిన పిచ్‌లపై అసంతృప్తిగా ఉంది. యాజమాన్యం పిచ్ క్యూరేటర్‌లతో తమ ఆందోళనలను వ్యక్తం చేసింది. పిచ్‌ను సిద్ధం చేస్తున్నప్పుడు తమ సిబ్బందిని క్యూరేటర్‌ల వద్దకు కూడా పంపింది. దీని అర్థం ఫైనల్ కోసం పిచ్‌ను భారత జట్టు డిమాండ్లకు అనుగుణంగా సిద్ధం చేయవచ్చని స్పష్టంగా తెలుస్తుంది.

ఫైనల్ మ్యాచ్ కోసం పిచ్ రెడ్‌, బ్లాక్ సాయిల్‌ నేలల మిశ్రమంగా ఉంటుంది, రెడ్‌ సాయిల్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీని అర్థం బ్యాట్స్‌మెన్‌కు లాభిస్తుంది. ఏ జట్టుకైనా గణనీయమైన ప్రయోజనం ఉండే అవకాశం లేదు, కానీ మరొక సెమీ-ఫైనల్ లాగా, ఇది అధిక స్కోరింగ్ మ్యాచ్‌గా మారే ఛాన్స్ లేకపోలేదు.  

ఆదివారం జరిగే T20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌కు నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ ఎలా ఉంటుందనే ప్రశ్నకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన వైఖరిని స్పష్టం చేశాడు: పిచ్ పట్టింపు లేదు. మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో, కెప్టెన్ " పిచ్‌ రిపోర్ట్‌పై చర్చ"ను తగ్గించి, తన జట్టు ఏ సర్‌ఫేస్‌కైనా అనుగుణంగా మారడానికి సిద్ధంగా ఉందని నొక్కి చెప్పాడు. ఈ వేదికపై నిర్దిష్ట ట్రాక్‌లపై భారత్‌ గతంలో ఎదుర్కొన్న ఇబ్బందుల తర్వాత పరిశీలన ఉన్నప్పటికీ, యాదవ్ తన జట్టు ప్రతిభపై  విశ్వాసం వ్యక్తం చేశాడు.

రెడ్‌, బ్లాక్ లేదా మిశ్రమమా? మేము దేనికైనా సిద్ధమే

అహ్మదాబాద్ స్క్వేర్ మూడు రకాల ట్రాక్‌లను అందించడానికి ప్రసిద్ధి చెందింది: ఎర్ర నేల (బౌన్స్‌ అండ్ స్పీడ్‌), నల్ల నేల (స్లో అండ్‌ స్కిడ్డింగ్) హైబ్రిడ్ మిశ్రమం. అధిక స్కోరింగ్ ఫైనల్‌ను నిర్ధారించడానికి క్యూరేటర్లు ఎరుపు ఆధిపత్య ఉన్న మిశ్రమ పిచ్‌ వైపు మొగ్గు చూపుతున్నారని నివేదికలు సూచిస్తున్నప్పటికీ, సూర్యకుమార్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదని అర్థమవుతోంది. 

"మనం ఫైనల్ ఆడాలి, కాబట్టి ఏ సాయిల్ అయినా పర్వాలేదు. ఈ టోర్నమెంట్‌లో మేం ఎరుపు,  నలుపు సాయిల్‌పై ఆడాం. మేము బాగానే ఆడాం, కాబట్టి ఏదైనా పర్వాలేదు." — సూర్యకుమార్ యాదవ్

కెప్టెన్ తాను ఇంకా అధికారికంగా పిచ్ తనిఖీ చేయలేదని ఒప్పుకున్నాడు, సిబ్బంది మధ్యలో ఉన్నప్పుడు, తాను డ్రెస్సింగ్ రూమ్ నుంచి నేరుగా మీడియా సమావేశానికి వచ్చినట్టు తెలిపాడు. 

టాస్ ఫ్యాక్టర్: డిఫెండ్ లేదా చేజ్?

జట్టు లక్ష్యాన్ని నిర్దేశించడానికా లేదా ఛేజ్ చేయానికి ప్రాధాన్యతనిస్తుందా అని అడిగినప్పుడు, SKY దేనికైనా సిద్ధమని అన్నాడు. 

"మేము రెండింటినీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఛేజ్ చేశాం,గెలిచాము; మేము డిఫెండ్ చేశాం, గెలిచాము." సూర్య అన్నాడు.

"న్యూజిలాండ్ చాలా వ్యూహాత్మక జట్టు. వారు కచ్చితమైన ప్రణాళికలతో వస్తారు. మేము ఏమి చేయాలనుకుంటున్నామో దానిపై పూర్తిగా దృష్టి సారించాం. మంచి క్రికెట్ ఆడతాం."  

Frequently Asked Questions

T20 ప్రపంచ కప్ ఫైనల్ ఎప్పుడు జరుగుతుంది?

T20 ప్రపంచ కప్ ఫైనల్ మార్చి 8న జరగనుంది.

ఫైనల్ మ్యాచ్ ఏ స్టేడియంలో జరుగుతుంది?

ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది.

అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉండనుంది?

అహ్మదాబాద్ పిచ్ రెడ్, బ్లాక్ సాయిల్ మిశ్రమంతో తయారు చేయబడుతోంది. ఇది బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండి, అధిక స్కోరింగ్ మ్యాచ్ కు దారితీయవచ్చు.

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పిచ్ గురించి ఏమన్నాడు?

సూర్యకుమార్ యాదవ్ పిచ్ ఎలా ఉన్నా తమ జట్టు ఆడటానికి సిద్ధంగా ఉందని, పిచ్ గురించి పెద్దగా పట్టించుకోమని అన్నాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 RR VS SRH Result Update: రాయ‌ల్స్‌ విజయాలకు బ్రేక్ వేసిన స‌న్ రైజ‌ర్స్! చెరో నాలుగేసి వికెట్ల‌తో ప్ర‌ఫుల్, స‌కీబ్ డెబ్యూ !
రాయ‌ల్స్‌ విజయాలకు బ్రేక్ వేసిన స‌న్ రైజ‌ర్స్! చెరో నాలుగేసి వికెట్ల‌తో ప్ర‌ఫుల్, స‌కీబ్ డెబ్యూ !
Jasprit Bumrah News: వికెట్ లెస్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ పేసర్ గురించి అశ్విన్ రీప్లై..
వికెట్ లెస్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ పేసర్ గురించి అశ్విన్ రీప్లై..
Praful Hinge Dream Debut: ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
వాంఖడేలో రికార్డుల మోత.. 11 ఏళ్ల రికార్డు బద్ధలుకొట్టిన ఆర్సీబీ, ముంబై
వాంఖడేలో రికార్డుల మోత.. 11 ఏళ్ల రికార్డు బద్ధలుకొట్టిన ఆర్సీబీ, ముంబై
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRAA Fact Check: హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
Praful Hinge Dream Debut: ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
Strait of Hormuz:
"హర్మూజ్ జలసంధి స్వాధీనం" అమెరికా సంచలన ప్రకటన! ఇరాన్ నౌకలు కనిపిస్తే పేల్చేస్తామని హెచ్చరిక!
TGSRTC Strike : తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ ! 22వ తేదీ నుంచి విధుల బహిష్కరణ!32 డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి!
తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ ! 22వ తేదీ నుంచి విధుల బహిష్కరణ!32 డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి!
Jasprit Bumrah News: వికెట్ లెస్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ పేసర్ గురించి అశ్విన్ రీప్లై..
వికెట్ లెస్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ పేసర్ గురించి అశ్విన్ రీప్లై..
India-Pakistan Border Surveillance: భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
Viral News: ఎడ్ల బండి కాన్వాయ్‌పై పెళ్లి కూతురు! గోదారోళ్లు ఏం చేసిన ట్రెండే! సోషల్ మీడియాలో వైరల్!
ఎడ్ల బండి కాన్వాయ్‌పై పెళ్లి కూతురు! గోదారోళ్లు ఏం చేసిన ట్రెండే! సోషల్ మీడియాలో వైరల్!
AI Wife: డిజిటల్ వరల్డ్ లోకి ఏఐ వైఫ్ ఆహ్వానం - సంతోషంగా సూసైడ్ చేసుకున్న వ్యక్తి - పిచ్చి ఇలా కూడా ముదిరిపోతోంది!
డిజిటల్ వరల్డ్ లోకి ఏఐ వైఫ్ ఆహ్వానం - సంతోషంగా సూసైడ్ చేసుకున్న వ్యక్తి - పిచ్చి ఇలా కూడా ముదిరిపోతోంది!
Embed widget