అన్వేషించండి

Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే

Kamareddy News | అదృశ్యమైన ముగ్గురు బాలికల కథ విషాదాంతమైంది. కన్నతండ్రే వారిని చెరువులోకి తోసేసి హత్య చేసినట్లు కామారెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించాడు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం కేసు విషాదకరంగా ముగిసింది. శనివారం ఉదయం నుండి కనిపించకుండా పోయిన ముగ్గురు చిన్నారులు, రాత్రి 9 గంటల సమయంలో కామారెడ్డి పెద్దచెరువులో మృతదేహాలుగా లభ్యం కావడంతో స్థానికంగా విషాదం నెలకొంది. మృతి చెందిన చిన్నారులను కామారెడ్డి పట్టణంలోని ఆర్బీనగర్ కాలనీకి చెందిన షీపత్ (8), ఆయత్ (7), మరియం (5)గా గుర్తించారు. చిన్నారులు కనిపించడం లేదని పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన కొద్ది గంటల్లోనే, ఇద్దరి మృతదేహాలు చెరువులో బయటపడటం విషాదాన్ని నింపింది.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన కామారెడ్డి పోలీసులు కన్న తండ్రే ఆ ముగ్గురు చిన్నారులను చంపాడని గుర్తించారు. పిల్లలు ఎప్పటి నుంచి కనిపించడం లేదని, ఏం జరిగిందని పోలీసులు ప్రశ్నించగా.. ఇస్మాయిల్ పొంతన లేదని సమాధానాలు చెప్పాడు. దాంతో అతడే చిన్నారులను చంపి ఉంటాడని ప్రాథమికంగా భావించారు. ఈ మేరకు అనుమానితుడైన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నాడు. తానే పిల్లలను చెరువులోకి ఒక్కొక్కరిగా తోసేసి హత్య చేశానని పోలీసుల విచారణలో ఇస్మాయిల్ అంగీకరించాడు.


Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే

ఆ పిల్లల తల్లి షబీనా స్థానికుల ఇళ్లల్లో పనులు చేస్తుండగా, తండ్రి ఇస్మాయిల్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, తన భర్తకు అప్పుడప్పుడు మతిమరుపు ఉంటుందని పిల్లల తల్లి పోలీసులకు తెలిపింది. అయితే శనివారం మధ్యాహ్నం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన షబానాకు పిల్లలు కనిపించకపోవడంతో భర్తను అడిగింది. సరైన సమాధానం రాకపోవడంతో కామారెడ్డి పోలీస్ స్టేషన్లో తల్లి ఫిర్యాదు చేసింది. 

పోలీసులు 3 టీంలుగా విడిపోయి విచారణ చేపట్టారు. పిల్లల తండ్రి ఇస్మాయిల్‌ను పలుమార్లు ప్రశ్నించగా పొంతలేని సమాధానాలు చెప్పాడు. ఐస్ క్రీమ్ కొనిచ్చేందుకు బయటకు తీసుకెళ్లానని.. తరువాత తనకు పని ఉందని, పిల్లల్ని ఇంటికి పంపించానని చెప్పాడు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు, ఇస్మాయిల్ చెప్పిన మాటలకు, జరిగినదానికి పొంతలన లేకపోవడంతో అదుపులోకి తీసుకుని మళ్లీ ప్రశ్నించారు. తానే పిల్లలను చెరువులోకి తోసేసి హత్య చేశానని.. వారు చనిపోయారా లేదా అని నిర్ధారించుకోవడానికి అరగంటపాటు అక్కడే ఉన్నానని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. మొదట రెండో కుమార్తెను, తరువాత చిన్న కూతుర్ని, చివరగా పెద్ద కూతుర్ని చెరువులోకి తోసేసి హత్య చేసినట్లు తండ్రి ఇస్మాయిల్ అంగీకరించాడు. 

హత్యలకు గల కారణం ఏంటీ.. ?

ఇది ప్లాన్ ప్రకారం చేసిన హత్యలేనని కామారెడ్డి పోలీసులు గుర్తించారు. తనకు రూ.5 లక్షలకు పైగా అప్పులు ఉన్నాయని, వాటిని తిరిగి చెల్లించడం కుదరదని, పిల్లల్ని సైతం పోషించలేదని వారిని హత్య చేసినట్లు నిందితుడు ఇస్మాయిల్ తెలిపాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో తెలిపాడు. శనివారం రాత్రి రెండో కూతురు, మూడో కూతురు మృతదేహాలను చెరువులో నుంచి వెలికితీశారు. పెద్ద కూతురు మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో ఆర్బీనగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో మూడు రోజులు జాగ్రత్త! 'సన్‌'చలన అలర్ట్ జారీ చేసిన అధికారులు!
తెలంగాణలో మూడు రోజులు జాగ్రత్త! 'సన్‌'చలన అలర్ట్ జారీ చేసిన అధికారులు!
Tejaswi Surya: ఆంధ్రప్రదేశ్ విభజన, రేవంత్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన తేజస్వి సూర్య ఎవరు? బ్యాంక్‌గ్రౌండ్ ఏంటీ?
ఆంధ్రప్రదేశ్ విభజన, రేవంత్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన తేజస్వి సూర్య ఎవరు? బ్యాంక్‌గ్రౌండ్ ఏంటీ?
Telangana News: ఎస్సీ, ఎస్టీ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం! పదివేల మందికి ఈవీల పంపిణీకి సిద్ధం!
ఎస్సీ, ఎస్టీ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం! పదివేల మందికి ఈవీల పంపిణీకి సిద్ధం!
Natures Wonder: ఒకే చెట్టు రెండు రంగులు.. ఆదిలాబాద్ జిల్లాలో వింత ఇప్ప చెట్టు.. ప్రత్యేకత ఏంటంటే
ఒకే చెట్టు రెండు రంగులు.. ఆదిలాబాద్ జిల్లాలో వింత ఇప్ప చెట్టు.. ప్రత్యేకత ఏంటంటే
Advertisement

వీడియోలు

IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజ‌యంతో స‌త్తా చాటిన బెంగుళూరు
Rasik Dar Salam vs LSG IPL 2026 | ఆర్‌సీబీ కొత్త సెన్సేషన్ రసిక్ సలామ్
Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్
Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Womens vote bank politics: మహిళలకు కాంగ్రెస్ కూటమి వ్యతిరేకం - బీజేపీ చెప్పేది ఇదే - ఎలా కౌంటర్ ఇచ్చుకుంటారు?
మహిళలకు కాంగ్రెస్ కూటమి వ్యతిరేకం - బీజేపీ చెప్పేది ఇదే - ఎలా కౌంటర్ ఇచ్చుకుంటారు?
Hyderabad Bus Fire: ఆగని ట్రావెల్ బస్‌ అగ్ని ప్రమాదాలు! స్లీపర్స్‌పై నిషేధానికి పెరుగుతున్న డిమాండ్! ఆ దేశాలే ఆదర్శం!
ఆగని ట్రావెల్ బస్‌ అగ్ని ప్రమాదాలు! స్లీపర్స్‌పై నిషేధానికి పెరుగుతున్న డిమాండ్! ఆ దేశాలే ఆదర్శం!
Ashwagandha Leaves Banned: అశ్వగంధ ఆకులపై నిషేధం! ఆహార ఉత్పత్తుల్లో వాడొద్దని FSSAI ఆదేశం!
అశ్వగంధ ఆకులపై నిషేధం! ఆహార ఉత్పత్తుల్లో వాడొద్దని FSSAI ఆదేశం!
Vishnu Manchu: గాయం మానింది కానీ గుర్తులు చెరిగిపోలేదు... మంచు విష్ణు
గాయం మానింది కానీ గుర్తులు చెరిగిపోలేదు... మంచు విష్ణు
Lok Sabha Today: లోక్‌సభలో ఇవాళేం చేయబోతున్నారు? కేబినెట్ భేటీ వెనుక మాస్టర్ ప్లాన్.. డీలిమిటేషన్ అస్త్రం సిద్ధం?
లోక్‌సభలో ఇవాళేం చేయబోతున్నారు? కేబినెట్ భేటీ వెనుక మాస్టర్ ప్లాన్.. డీలిమిటేషన్ అస్త్రం సిద్ధం?
Hydrogen Stove : LPG కొరతలో కొత్త సొల్యూషన్.. నీటితోనే పనిచేసే హైడ్రోజన్ స్టౌవ్ ధర, పూర్తి వివరాలివే
LPG కొరతలో కొత్త సొల్యూషన్.. నీటితోనే పనిచేసే హైడ్రోజన్ స్టౌవ్ ధర, పూర్తి వివరాలివే
Bellamkonda Sai Sreenivas Wedding: చంద్రబాబును కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ... హీరో పెళ్లి పిలుపులు మొదలు
చంద్రబాబును కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ... హీరో పెళ్లి పిలుపులు మొదలు
Mahila Reservation Bill: లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ అమలు సవరణ బిల్లు! వ్యతిరేకంగా 230 ఓట్లు , గ్రహాలు ముందే సంకేతం ఇచ్చాయా?
లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ అమలు సవరణ బిల్లు! వ్యతిరేకంగా 230 ఓట్లు , గ్రహాలు ముందే సంకేతం ఇచ్చాయా?
Embed widget