అన్వేషించండి

TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు

Chevireddy: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు జైల్లో ప్రశ్నించారు. కల్తీ నెయ్యి కేసులో పలు వివరాలను తెలుసుకున్నారు.

CBI officials question Chevireddy : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలపై నమోదైన కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసును విచారిస్తున్న  సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సోమవారం  ప్రశ్నించింది.  ప్రస్తుతం విజయవాడ జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోర్టు నుండి ప్రత్యేక అనుమతి పొందారు.

స్కాం జరిగినప్పుడు టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి                       

గత ప్రభుత్వ హయాంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డులో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండేవారు. ఆ సమయంలో నెయ్యి కొనుగోలుకు సంబంధించి టెండర్ నిబంధనలను మార్చడం, అర్హత లేని సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టడంపై సీబీఐ అధికారులు ఆయన్ను ప్రధానంగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌కు చెందిన  బోలేబాబా డెయిరీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా చేసే అవకాశం ఎలా కల్పించారనే కోణంలో విచారణ సాగినట్లుగా తెలుస్తోంది.   

దాదాపుగా మూడు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ                    

ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలతో కూడిన సీబీఐ సిట్ బృందం.. సుమారు మూడు గంటల పాటు చెవిరెడ్డిని ప్రశ్నించింది. నెయ్యి నాణ్యత పరీక్షల్లో వచ్చిన తప్పుడు నివేదికల వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి? కొనుగోలు కమిటీ నిర్ణయాల్లో రాజకీయ జోక్యం ఉందా? అనే అంశాలపై ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. కొన్ని కీలక పత్రాలను కూడా ఆయన ముందు ఉంచి వివరణ కోరినట్లు సమాచారం.  

లిక్కర్ స్కాంలో జైల్లో ఉన్న చెవిరెడ్డి                                                

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే  మద్యం కేసు లో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నారు. ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో కూడా సీబీఐ ఆయనను విచారించడం ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి వంటి ఉన్నతాధికారులను విచారించిన సిట్, ఇప్పుడు రాజకీయ నేతలపై దృష్టి సారించడంతో తదుపరి ఎవరికి నోటీసులు అందుతాయనేది ఉత్కంఠగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన ఈ సీబీఐ సిట్ బృందం, గత ఐదేళ్లలో సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని ప్రాథమికంగా గుర్తించింది. ఇందులో జరిగిన రూ. 250 కోట్ల కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది.                  

 

 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Pulivendula: వైసీపీ హయాంలో ఏకగ్రీవాలు మంచివి .. ఇప్పుడు చెడ్డవా? జగన్ వాదన తేలిపోతోందా?
వైసీపీ హయాంలో ఏకగ్రీవాలు మంచివి .. ఇప్పుడు చెడ్డవా? జగన్ వాదన తేలిపోతోందా?
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
CM Chandrababu: వైసీపీ ఉన్మాదంతో ఏపీ బ్రాండ్ కోల్పోయింది.. గొడ్డలి పార్టీ తప్పులను ప్రజలు మర్చిపోరు - సీఎం చంద్రబాబు
వైసీపీ ఉన్మాదంతో ఏపీ బ్రాండ్ కోల్పోయింది.. గొడ్డలి పార్టీ తప్పులను ప్రజలు మర్చిపోరు - సీఎం చంద్రబాబు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Embed widget