చాణక్య నీతి: 10 మంచి మాటలు.. పొరపాటున ఫాలో అయినా మీరు గొప్పోళ్లే!

మూర్ఖులతో వాదన పెట్టుకోవద్దు.. మీరు ఏం చెప్పినా వారి బుర్రకు ఎక్కదు..మీ సమయం వృధా అవుతుంది

భగవంతుడు మీ మనసులో ఉంటాడు ఆలయాల్లో ఉండే విగ్రహాల్లో కాదు..మీ మనసే ఆలయం, మంచి ఆలోచనే నైవేద్యం

అప్పు, శత్రువు, రోగం..వీటిని చిన్నచూపు చూస్తే నిండా ముంచేస్తాయ్..వెంటనే పరిష్కరించుకోండి

కష్టం వచ్చిందని లక్ష్యాన్ని పక్కనపెట్టేస్తే ఎప్పటికీ అడుగు ముందుకువేయలేరు..దృఢంగా ఉండాల్సింది ఈ సమయంలోనే

మీరు మాట్లాడుతున్న వ్యక్తి దృష్టి మీపై కాకుండా చుట్టుపక్కల విషయాలపై ఉంటే అలాంటివారు నమ్మదగినవారు కాదు

మీ తప్పుల నుంచే కాదు..ఇతరుల తప్పుల నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటే సక్సెస్ మీ సొంతం అవుతుంది

అదృష్టాన్ని నమ్ముకోవద్దు..కష్టపడండి..అప్పుడు ఫలితం ఆలస్యం కావొచ్చు కానీ రావడం పక్కా

తానున్న హోదా, స్థానం వల్ల ఉన్నతుడు కాలేడు..కేవలం మంచి లక్షణాల వల్లే ఉన్నతుడు అవుతాడు

మీకు గౌరవం లేని ప్రదేశానికి వెళ్లకూడదు..మిమ్మల్ని గౌరవించని దగ్గర నివాసం ఉండకూడదు

సువాసన ఉండే చెట్టు అడవి మొత్తం పరిమళం ఇస్తుంది..ఓ మంచి వ్యక్తి వంశానికి వెలుగునిస్తాడు