డిసెంబరు 16 నుంచి ధనుర్మాసం ప్రారంభం - ఏం చేయాలంటే! సూర్య భగవానుడు ధనస్సు రాశిలో సంచరించే ఈ నెలని ధనుర్మాసం అంటారు..ఈ నెలను అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. సౌరమానాన్ని అనుసరించి జరుపుకునే పండుగలలో ధనుర్మాసం, మకరసంక్రాంతి వస్తాయి 2024 డిసెంబరు 16న ప్రారంభమైన ధనుర్మాసం జనవరి 14న గోదాదేవి కళ్యాణంతో పూర్తవుతుంది ధనుర్మాసం దేవతలకు ప్రాతఃకాలం అని చెబుతారు..అందుకే ఈ నెల ఎంతో విశిష్టమైనది ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువు మేలుకొలుపులో భాగంగా రోజుకో పాశురం ఆలపించింది గోదాదేవి ధనుర్మాసంలో ప్రతి రోజూ వేకువ జామున, సాయంత్రం దీపారాధన చేస్తే లక్ష్మీఅనుగ్రహం ఉంటుంది ధనుర్మాసంలో భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తే ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.. వివాహం కానివారు ధనుర్మాసంలో విష్ణు ఆరాధన చేస్తే ఓ ఇంటివారవుతారని పండితులు చెబుతారు