మీతో మీరు చేసే కురుక్షేత్ర యుద్ధంలో గెలుస్తారా - ఓడిపోతారా!
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ:
మామకాకి పాండవాశ్చైవ కీమ కుర్వత సంజయ:
ఎవరి ధర్మాన్ని , ఎవరి కర్తవ్యాన్ని వారు చిత్త శుద్ధితో నిర్వర్తించాలన్నదే ఈ శ్లోకం ఆంతర్యం
తల్లిదండ్రులు చెప్పింది వినడం, గురువులు బోధించింది ఆచరించడం.. పెద్దలను గౌరవించడం, బాగా చదువుకోవడం
స్త్రీల ధర్మం..గృహిణిగా తన బాధ్యతలు సంపూర్ణంగా ప్రేమగా నిర్వర్తించడం, పురుషుడు.. గృహస్థుడిగా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం
ధర్మక్షేత్రం - కురుక్షేత్రం అంటే..ఏదో ప్రదేశమో, యుద్ధభూమో కాదు...దేహమే ధర్మక్షేత్రం
ఈ భూమ్మీద అడుగుపెట్టినప్పుడు నిస్వార్థమైన, నిర్మలమైన, నిరహంకారమైన, ఎలాంటి కోర్కెలు లేని పవిత్ర హృదయం ఉంటుంది
అలాంటి ధర్మక్షేత్రంలాంటి దేహం.. పెరిగే కొద్దీ, ఆహారం మారే కొద్దీ, పాశం పెరిగేకొద్దీ చాలా మార్పులు చోటుచేసుకుంటాయి
రాగ ద్వేషాలు ప్రవేశిస్తాయి..అభిమానం, మమకారం, ఆగ్రహం ఇవన్నీ వృద్ధి చెందుతాయి..అప్పుడే ఈ దేహం కురుక్షేత్రంగా మారుతుంది
ధర్మక్షేత్రంగా పుట్టి కురుక్షేత్రంగా మారే ఈ దేహంలో చెడుగుణాలు కౌరవులకు... సాత్విక గుణాలు పాండవులకు నిదర్శనం..
మంచి-చెడు... ఈ రెండింటి మధ్యా యుద్ధమే జీవితం..ధర్మాన్ని పాటించివారిదే ఈ యుద్ధంలో విజయం..