భాగవతం - భారతం - భగవద్గీత..వీటి మధ్య వ్యత్యాసం ఏంటి!
భాగవతం - భారతం - భగవద్గీతకి తేడా ఏంటనే సందేహం చాలా మందికి ఉంది
హిందువులకు ఈ విషయంపై తప్పనిసరిగా క్లారిటీ ఉండాలి
భాగవతం అంటే శ్రీకృష్ణుడి కథ మొత్తం అందులో ఉంటుంది
శ్రీకృష్ణుడి బాల్యంతో పాటూ..ఆయన భక్తుల కథలు..దశావతారాలు గురించి కూడా ఉంటుంది
మహాభారతం అంటే పాండవులు-కౌరవుల కథ...వారి పుట్టుక, విద్యాభ్యాసం, రాజ్యపాలన..
అరణ్యవాసం, అజ్ఞాతవాసం కురుక్షేత్ర సంగ్రామం వరకూ మహాభారతం ఉంటుంది
భగవద్గీత అంటే.. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన శ్లోకాల సమాహాం
ఇందులో కథలు ఉండవు.. భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, మోక్ష మార్గం ఉంటాయి