చాణక్య నీతి: 'సరైనోడు' అని ఎవర్ని అంటారో తెలుసా!

అధిత్యేవం యథాశాస్త్రం నరో జానాతి నత్తమః
ధర్మోపదేశవిర్యాతం కార్యకార్యాశుభాశ్శుభమ్

ఉత్తమ మానవుడు అని ఎవర్ని అంటారో ఈ శ్లోకంలో వివరించారు ఆచార్య చాణక్యుడు

ధర్మాన్ని ఉపదేశించేవారు, చేయదగిన, చేయకూడని పనులు చెప్పేవారు..శుభం, అశుభాన్ని వివరించి చెప్పేవారే శ్రేష్ఠులు

ఉత్తమ మనిషి..తనకోసం ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుంటాడు. ధర్మం, అధర్మాన్ని ఎరిగి ప్రవర్తిస్తాడు

నిప్పు ధర్మం మండడం , నీటి ధర్మం మంటను ఆపేయడం...భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించింది కూడా ఇదే..

అలా మనిషి ఆచరించాల్సిన వాటిలో కొన్ని ధర్మమైన, మరికొన్ని ధర్మవిరుద్ధమైన పనులుంటాయి

యుద్ధభూమిలో ఎదురుగా వచ్చిన శత్రువుతో యుద్ధం చేయడం క్షత్రియ ధర్మం..యుద్ధం నుంచి పారిపోవడం అంటే పిరికితనం

అందుకే ధర్మాధర్మ విచక్షణతో ఎప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలిసిన వారినే సరైన మనిషి అన్నారు చాణక్యుడు