ఫస్ట్ నైట్ రాత్రి మాత్రమే ఎందుకు చేస్తారు!

Published by: RAMA

రాత్రే ఎందుకు?

ఫస్ట్ నైట్ అంటారు కానీ ఫస్ట్ పగలు అనరు..అసలు ఈ కార్యక్రమం రాత్రి మాత్రమే ఎందుకు చేస్తారు?

షోడశ సంస్కారాలు

హిందూ ధర్మములో (16) షోడశ సంస్కారాలు ఉన్నాయి.. వాటిలో మొదటిది గర్భాదానం

పవిత్రమైన క్రతువు

గర్భాదానం అత్యంత పవిత్రమైన క్రతువు.. అందుకే అత్యంత పవిత్రమైన ఈ కార్యానికి ఓ ముహూర్తం నిర్ణయిస్తారు

పగటిపూట కూడదు!

గర్భాదానం జరిపేందుకు విధించిన నిమయాల్లో ముఖ్యమైనది పగటిపూట చేయరాదు అని. పగటి పూట గర్భాదానం చేస్తే గుణహీనుడైన బిడ్డ జన్మిస్తాడని శాస్త్రంలో ఉంది

రాక్షస ప్రవృత్తి

సంధ్యా సమయంలో గర్భాదానం చేస్తే రాక్షస ప్రవృత్తిగల సంతానం జన్మిస్తారు..అందుకే రాత్రి వేళ మాత్రమే మహూర్తం నిర్ణయిస్తారు

పవిత్రమైన ఆలోచన

తల్లి తండ్రుల హృదయం, శరీరం నుంచి సంతానం జన్మిస్తారు. అందుకే తల్లిదండ్రుల స్థూల, సూక్ష్మ, శరీరాల్లో ఉండే దోషాలు పిల్లలకు సంక్రమిస్తాయి

బీజం పడే సమయం ప్రధానం

భార్య భర్త మంచి ముహూర్తంలో సత్వగుణంతో..మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉన్నప్పుడు బీజం పడితే ఆ దోషాలు సంతానానికి సంక్రమించవు

భగవద్గీతలో గీతలో శ్రీకృష్ణుడు

ధర్మవిరుద్దో భూతేషు కామోస్మి భరతర్షభ (మనుష్యులందు ధర్మ విరుద్దము కాని కామము తానై ఉన్నాను)

గర్భాదాన సంస్కార సమయంలో శ్లోకం

ఓం పూశాభాగం సవితామే దదాతు|
ఓం విష్ణు యోనిం కల్పయితు||