VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
MGNREGA: మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కమ్యూనిస్టు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వారికి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు.

MGNREGA VS VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకు వచ్చి “వికసిత్ భారత్ – గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్” అని పేరు మార్చింది.అలాగే ఇందులో పని దినాలను 125 రోజులకు పెంచడంతో పాటు పలు మార్పులు చేశారు. ఈ అంశాలపై తెలుగు రాష్ట్రాలకు చెందిన కమ్యూనిస్టు పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ తగ్గిపోతుందని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో పేరుతో మహాత్మాగాంధీ పేరు తీసేసి వేరే మతం పేరు వచ్చేలా పెట్టారని ఆరోపిస్తున్నారు. వీరి ఆరోపణలకు బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
“వికసిత్ భారత్ – గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్” పథకంపై వక్రభాష్యాలు చెబుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విష్ణు ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని నేటి కాలానికి తగ్గట్లుగా మార్పులు చేస్తే అందులోని మంచిని చూడాల్సింది పోయి పేరు మార్చారని విమర్శిస్తున్నారు. మహాత్మాగాంధీ జాతిపిత. ఓ పథకానికి ఆయన పేరు పెట్టి ఆయనను గౌరవించామని ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ది పొందారు. కానీ గ్రామసీమలే దేశానికి పట్టుగొమ్మలు అని చెప్పి ఆ గ్రామాలను అభివృద్ధి చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందనేది మహాత్ముడి ఆశయ. ఆ ఆశయాన్ని నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మార్పుచేర్పులు చేసి “వికసిత్ భారత్ – గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్” చట్టం తీసుకు వచ్చింది. ఇందులో భారత్ పేరే ఉంది. భారత్ ఆత్మ మహాత్ముడు. ఆయన ఆశయాల రూపమే పథకమన్నారు.
కమ్యూనిస్టులకు వికసిత్ భారత్ – గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్” అనే పేరులోనూ తమ కనబడుతోందంటే ఎవరి మనసుల్లో మతోన్మాదం నిండిపోయిందో అర్థం చేసుకోవచ్చని విమర్శఇంచారు. ఈ పథకం గ్రామప్రాంతాల్లో ప్రజలందరికీ మేలు చేసేది. ఏ కులానికీ.. మతానికి ప్రత్యేకంగా కాదు. అలాంటి ముద్ర వేసే ప్రయత్నం చేస్తే.. పేదలపై కుట్ర చేసినట్లే.కమ్యూనిస్టులు తాము పేదలకు మేలు చేస్తున్నామంటూ సుదీర్ఘంగా చేస్తున్నది వాళ్లకు హాని చేయడమేమన్నారు. “వికసిత్ భారత్ – గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్” లో గ్రామీణలకు ఉపాధి లభించే రోజులు 125కి పెరిగాయి. కానీ తగ్గిపోతాయని వితండవాతం చేస్తున్నారు కమ్యూనిస్టులు. గతంలో చేసిన పనులే చేస్తే ఉపాధి నిధులను మధ్యవర్తులు, దళారీలు కాజేసేవాళ్లు అలాంటి అవకాశం లేకుండా పూర్తి స్థాయి అకౌంటబులిటీతో పథకంలో మార్పులు చేస్తే మీరు ఎందుకు బాధపడుతున్నారు?. ఉపాధి హామీ చట్టం రద్దు చేశారన్నట్లుగా ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారు.. కానీ ఆ చట్టంలో మార్పులు చేసి అవినీతికి చెక్ పెట్టి.. సమగ్ర గ్రామీణ వికాసానికి.. కూలీల నుంచి నైపుణ్యం ఉన్న వ్యక్తిగా ఎదిగేలా గ్రామీణుల్ని మారుస్తున్నారని ఎవరికీ తెలియకూడదని అనుకుంటున్నారని మండిపడ్డారు.
గ్రామీణ పేదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల కుట్రలు !
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) December 22, 2025
పేదలకు మంచి జరిగినా ఆ నిర్ణయం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తీసుకుంది కాబట్టి వ్యతిరేకించాల్సిందే" అన్న పడికట్టు భావజాలంతో ఉండే కమ్యూనిస్టు పార్టీ నేతలు “వికసిత్ భారత్ – గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్” పథకంపై… pic.twitter.com/7OP6jFJpp7
. ముందు ప్రజలకు మేలు జరిగే ఏ సమస్యలపై పోరాడారో వారు గుర్తు తెచ్చుకోవాలి. పేదలను రెచ్చగొట్టేందుకు.. కార్మికులను పస్తు పెట్టేందుకు పోరాటాలు చేశారు. వికసిత్ భారత్ – గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్” పథకాన్ని ప్రజలే ముందుకు తీసుకెళ్తారు. గ్రామీణులే ఆ పథకం అండతో తమ జీవితాల్ని మెరుగుపర్చుకుంటారు. కమ్యూనిస్టుల ప్రయత్నాలను తిప్పికొడతారని హెచ్చరించారు.





















