అన్వేషించండి

Pawan meets Chandrababu : గ్రామ వికాసమే లక్ష్యం - చంద్రబాబు-పవన్ భేటీలో కీలక నిర్ణయాలు

Deputy CM Pawan: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ రెండు గంటల పాటు చర్చించారు. గ్రామీణాభివృద్ధి పథకాలపై చర్చించారు.

Chandrababu meeting with Pawan on administrative matter : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన తాజా భేటీ రాష్ట్ర రాజకీయాల్లోనూ, అధికార వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తించింది. అయితే వీరి భేటీ పూర్తిగా పాలనా పరమైన అంశాల ఆధారంగానే సాగిందని తెలుసతోంది.  గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సాగిన ఈ భేటీపై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.  

గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా జాగ్రత్తలు

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. మంగళవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా ,  అటవీ శాఖలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులపై సమగ్ర చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాలుగా ఉన్నప్పటికీ, గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. 

జల్ జీవన్ మిషన్ పనులపై ప్రత్యేక దృష్టి 

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షితమైన మంచినీరు అందించే జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ పురోగతిని ఈ సందర్భంగా సమీక్షించారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని అభిప్రాయపడిన నేతలు, ఇప్పుడు దీనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తలసరి రోజుకు 55 లీటర్ల నీటిని అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామీణ రహదారుల నిర్మాణం, నియోజకవర్గాల వారీగా నిధుల కేటాయింపుపై పవన్ కళ్యాణ్ సీఎంతో చర్చించారు.

 మ్యాజిక్ డ్రెయిన్లు - హనుమాన్ ప్రాజెక్ట్ 

పారిశుధ్య నిర్వహణలో భాగంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన  మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణాన్ని రాష్ట్రవ్యాప్తం చేయాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా సీఎం సానుకూలంగా స్పందించారు. వేసవి కాలం ముగిసేలోపే డ్రెయినేజీల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలని, తద్వారా సాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని నిర్ణయించారు. ఇదే సమయంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన  హనుమాన్ ప్రాజెక్ట్  వివరాలను పవన్ కళ్యాణ్ వివరించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల అనుసంధానం కోసం చేపట్టిన  అడవి తల్లి బాట  పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని ఇరువురు నేతలు ఒక అవగాహనకు వచ్చారు.

 అభివృద్ధికి బాటలు.. వికసిత్ భారత్ దిశగా 

 గ్రామాల బలోపేతం కోసం ముఖ్యమంత్రి అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ విమర్శలు పక్కన పెట్టి, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలుపుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ భేటీలో కేవలం అభివృద్ధి అంశాలే కాకుండా, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి రాజకీయ అంశాలపై కూడా ఇరువురు నేతలు ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం.              


  

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: ఈ నెల 14న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.. సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ
ఈ నెల 14న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.. సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ
AP Municipal Chairman Reservations: ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు అగ్రతాంబూలం
ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు అగ్రతాంబూలం
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Municipal Elections 2026 Reservations: ఏపీలో స్థానిక ఎన్నికలు.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల
ఏపీలో స్థానిక ఎన్నికలు.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget