India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్‌ను 191 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 8 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది.
భారీ టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన భారత్ కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రేతో సహా అందరూ విఫలం కావడంతో పాక్ చేతిలో దారుణ పరాభవం తప్పలేదు. దాంతో 191 పరుగుల తేడాతో భారత్ మీద పాక్ అండర్ 19 టీమ్ విజయం సాధించి ట్రోఫీ అందుకుంది.
ఈ మ్యాచ్ లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తొలి బంతికే సిక్సర్ కొట్టాడు. కానీ 10 బంతుల్లో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే కేవలం రెండు పరుగులకె అవుట్ అయ్యాడు. 10వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన దీపేష్ దేవేంద్రన్ అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. చివర్లో బ్యాటింగ్ కు దిగిన దేవేద్రంన్ 16 బంతుల్లో 36 పరుగులు చేశాడు.
పాక్ ఓపెనర్ సమీర్ మిన్హాస్ 172 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చేశాడు. దీపేశ్ వేసిన 43వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్ బాదిన సమీర్.. ఐదో బంతికి భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.





















