India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
భారత్ శ్రీలంక మహిళల టీమ్స్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భరత్ ఘన విజయం సాధించింది. విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్, శ్రీలంకను 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులకే కట్టడి చేసింది.
మ్యాచ్ ఆరంభం నుంచే భారత బౌలర్లు చెలరేగిపొయ్యారు. దాంతో శ్రీలంక బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. శ్రీలంక టీమ్ లో విష్మి గుణరత్నె 39 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగితా ప్లేయర్స్ అంతగా రాణించలేక పొయ్యారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ, శ్రీ చరణి తలో వికెట్ పడగొట్టారు.
చాలా చిన్న లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ దూకుడుగా మ్యాచ్ ను ప్రారంభించారు. షెఫాలీ వర్మ త్వరగానే పెవిలియన్ కు చేరుకోగా జెమామా రోడ్రిగ్స్, ఓపెనర్ స్మృతి మంధాన మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరో 32 బంతులు మిగిలి ఉండగానే టీమ్‌ఇండియా విజయాన్ని సొంతం చేసుకుంది.





















