అన్వేషించండి

Nara Lokesh in Davos: దావోస్‌లో ఏపీని ప్రమోట్ చేస్తున్న నారా లోకేష్ - రెండో రోజు పది కీలక సమావేశాల్లో పెట్టుబడులపై చర్చలు

Nara lokesh: దావోస్‌లో నారా లోకేష్ విస్తృత సమావేశాల్లో పాల్గొన్నారు. పెట్టుబడులకు ఏపీలో ఉన్న అవకాశాలను అందరికీ సుదీర్ఘంగా వివరించారు.

Nara Lokesh participated in extensive meetings in Davos:  ఏపీ మంత్రి నారా లోకేష్ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో విస్తృత సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఏపీ పెవిలియన్ లో నిర్వహించిన సమావేశాల్లో పలు అంశాలపై నిపుణులు, పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు.  దావోస్ బెల్వెడేర్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా  “పర్యావరణ పరిరక్షణ – వాతావరణ ఉద్యమ భవిష్యత్” అనే అంశంపై స్వనీతి ఆధ్వర్యాన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.    2030నాటికి పునరుత్పాదక శక్తి, వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి  4ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయి. 2050నాటికి క్లీన్ హైడ్రోజన్ డిమాండ్ 125 - 585 ఎంటిపిఎ నడుమ ఉంటుంది. అప్పటికి పవర్ మార్కెట్ లో 50 నుంచి 65శాతంతో గ్రీన్ హైడ్రోజన్ పై చేయి సాధిస్తుంది. 2024లో గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ పరిమాణం $6.49 బిలియన్లను అధిగమించింది. 2032నాటికి ఇది సగటున 31శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. 25గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో పునరుత్పాదక ఇంధనరంగంలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది. కర్నూలు జిల్లాలోని 1 గిగావాట్ అల్ట్రా మెగా సోలార్ పార్కు వంటి ప్రముఖ ప్రాజెక్టులతోపాటు కేంద్రప్రభుత్వం ఇటీవల 4గిగావాట్ల సామర్థ్యం గల 4సోలార్ పార్కులను ఎపిలో ప్రకటించిందని లోకేష్ తెలిపారు.
Nara Lokesh in Davos: దావోస్‌లో ఏపీని ప్రమోట్ చేస్తున్న నారా లోకేష్ - రెండో రోజు పది కీలక సమావేశాల్లో పెట్టుబడులపై చర్చలు


మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ బిజినెస్ ఫౌండర్ ప్రెసిడెంట్, మార్కెటింగ్ ఛీఫ్ రాజమన్నార్ తో  నారా లోకేష్  భేటీ అయ్యారు.  ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఉన్న టాలెంట్ పూల్ ను దృష్టిలో ఉంచుకొని ఎపిలో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి, దీనిద్వారా దక్షిణాదిలో మాస్టర్ కార్డ్ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉందన్నారు. మాస్టర్ కార్డ్ కంపెనీ ప్రాధాన్యత అయిన ఫిన్ టెక్ కు  అనుగుణంగా ఎపిలో ఐటి వర్క్ ఫోర్స్ ను తయారుచేయడానికి  నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. 


Nara Lokesh in Davos: దావోస్‌లో ఏపీని ప్రమోట్ చేస్తున్న నారా లోకేష్ - రెండో రోజు పది కీలక సమావేశాల్లో పెట్టుబడులపై చర్చలు

 అన్నివిధాల అనుకూల వాతావరణం కలిగిన విశాఖపట్నంలో సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్  ఏర్పాటుచేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ప్రముఖ బహుళజాతి ఐటిసంస్థ సిస్కో వైస్ ప్రెసిడెంట్ ప్రాన్సిన్  కట్సౌదాస్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్  లో భేటీ అయ్యారు.  ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా వైజాగ్, విజయవాడ, తిరుపతి పరిసరాల్లో అనువైన స్థలం, ప్రతిభకలిగిన ఐటి వృత్తినిపుణులు అందుబాటులో ఉన్నారు.  USAలోని భారతీయ IT వర్క్‌ఫోర్స్‌లో 25% పైగా తెలుగు కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నారు.  ఎపిలో ఎఐ, నెట్‌వర్కింగ్, సైబర్‌సెక్యూరిటీలో అత్యంత నైపుణ్యం కలిగిన IT వర్క్‌ఫోర్స్‌ను రూపొందించడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.


Nara Lokesh in Davos: దావోస్‌లో ఏపీని ప్రమోట్ చేస్తున్న నారా లోకేష్ - రెండో రోజు పది కీలక సమావేశాల్లో పెట్టుబడులపై చర్చలు
అధునాతన ప్యాసింజర్ కార్ ఛాసిస్ ఆవిష్కరణలతో గ్లోబల్ సప్లయ్ చైన్ బలాన్ని పెంచుకునేందుకు జాయింట్ వెంచర్ గా ఆవిర్భవించిన జడ్ఎఫ్ ఫాక్స్ కాన్ ఛాసిస్ మాడ్యుల్స్ సంస్థ సిఇఓ ఐకీ డోర్ఫ్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్  లో సమావేశమయ్యారు. ఆటోమొబైల్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని అన్నారు. కియా, ఇసుజి వంటి ప్రఖ్యాత సంస్థలు తమ ప్యాసింజర్ కార్ల తయారీ యూనిట్లను ఎపిలో నెలకొల్పాయి.  ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, సరఫరా సప్లయ్ చైన్ ఏర్పాటుకు విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం వ్యూహాత్మక ప్రాంతాలు. జడ్ఎఫ్ ఫాక్స్ కాన్ ఛాసిస్ మాడ్యుల్స్ సంస్థ తయారీ యూనిట్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్ లోని విశాలమైన రోడ్లు, పోర్టులు, ఎయిర్ పోర్టులో సప్లయ్ చైన్ కార్యకలాపాలను మెరుగుపర్చుకునేందుకు దోహదపడతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై కంపెనీ బోర్డులో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని  ప్రతినిధులు తెలిపారు. 


Nara Lokesh in Davos: దావోస్‌లో ఏపీని ప్రమోట్ చేస్తున్న నారా లోకేష్ - రెండో రోజు పది కీలక సమావేశాల్లో పెట్టుబడులపై చర్చలు
ప్రపంచంలో నెం.1 టుబాకో ఉత్పత్తుల సంస్థ ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ సౌత్ ఈస్ట్ ఆసియా వైస్ చైర్ పర్సన్ (ఎక్స్ టర్నల్ ఎఫైర్స్) ఆండ్రియా గోంట్కోవికోవాతో   మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఫిలిప్ మోరిస్ అనుబంధ సంస్థ అయిన గాడ్ ఫ్రే ఫిలిప్స్ ద్వారా దేశంలో 2వ అతిపెద్ద పొగాకు ఉత్పత్తి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని కోరారు.  1054 కి.మీ.ల సువిశాల తీర ప్రాంతం, ఆరు ఆపరేషనల్ పోర్టులు కలిగి మారిటైమ్ ట్రేడ్ కు అనుకూల వాతావరణం కలిగి ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆండ్రియా గోంట్కోవికోవా తెలిపారు.
Nara Lokesh in Davos: దావోస్‌లో ఏపీని ప్రమోట్ చేస్తున్న నారా లోకేష్ - రెండో రోజు పది కీలక సమావేశాల్లో పెట్టుబడులపై చర్చలు


నేటి అధునాతన సాంకేతిక యుగంలో సులభతరమైన పాలనా విధానాల అమలు కోసం ఎఐని వినియోగించేందుకు ప్రపంచదేశాలు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నాయని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దైనందిన ప్రజాజీవితంలో ఎదురయ్యే సమస్యలపై ఎఐ ఆధారిత పరిష్కారాలను అన్వేషించేందుకు “కృత్రిమ మేధ సద్వినియోగంతో తెలివైన, స్థిరమైన భవిష్యత్ నిర్మాణం ( AI for Good – Shaping a Smarter, Sustainable Tomorrow)” అనే అంశంపై దావోస్  లో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.  ఈ ఏడాది గ్లోబల్ ఎఐ మార్కెట్ $243 బిలియన్లకు చేరుకోనుంది, ఇది 2030 నాటికి ప్రతిఏటా 27.67 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా.  అమరావతిలో ఎఐ సిటీని ఏర్పాటు చేయ్లాలని ఎపి ప్రభుత్వం భావిస్తోంది. రిమోట్ సెన్సింగ్, ఎఐ సాంకేతికలను ఏకీకృతం చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో మెరుగైన ఉత్పాదకత కోసం కృషిచేస్తున్నాం. పబ్లిక్ హెల్త్ విభాగంలో ఎఐ వినియోగం ద్వారా తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ, సర్వీస్ డెలివరీ మెరుగుదలకు చర్యలు చేపడుతున్నామని లోకేష్ తెలిపారు. 


Nara Lokesh in Davos: దావోస్‌లో ఏపీని ప్రమోట్ చేస్తున్న నారా లోకేష్ - రెండో రోజు పది కీలక సమావేశాల్లో పెట్టుబడులపై చర్చలు
ఆహార పదార్థాలు, యానిమల్ న్యూట్రిషన్, ప్రొటీన్, సాల్ట్ పారిశ్రామిక ఉత్పత్తులు, కమాడిటీస్ ట్రేడింగ్ లో  పేరెన్నికగన్న కార్గిల్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వెబ్ స్టర్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వెడేర్ లో భేటీ అయ్యారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా 8.5మిలియన్ హెక్టార్ల వ్యవసాయభూమి కలిగి ఉంది. రాష్ట్రంలోని 5 అగ్రో క్లైమిటిక్ జోన్లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, తృణధాన్యాలు, సన్ ఫ్లవర్, మామిడి, అరటి, నారింజ, నిమ్మ, పసుపు, కాఫీ, నల్లమిరియాలు వంటి పంటలను రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు, డి ప్రాంతాల్లో బంగాళా దుంపల సాగుకు సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి ఆర్ అండ్ డి కి సహకారం అందించండి. ఎడిబుల్ ఆయిల్ విభాగంలో స్థానిక ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాల భాగస్వామ్యంతో పనిచేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. 


Nara Lokesh in Davos: దావోస్‌లో ఏపీని ప్రమోట్ చేస్తున్న నారా లోకేష్ - రెండో రోజు పది కీలక సమావేశాల్లో పెట్టుబడులపై చర్చలు
అంతర్జాతీయస్థాయి లాజిస్టిక్స్ సంస్థ డిహెచ్ఎల్ సిఇఓ పాబ్లో సియానోతో మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... భారత్ కార్గో ట్రాఫిక్ లో 16.5శాతం వాటా కలిగి ఆంధ్రప్రదేశ్ 3వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. 35.77 మిలియన్ టన్నుల కార్గ్గో హ్యాండ్లింగ్ తో విశాఖపట్నం పోర్టు దేశంలోనే అతిపెద్ద పోర్టుగా ఉంది. కీలకమైన గంగవరం, కాకినాడ, రవ్వ, కృష్ణపట్నం వంటి కీలక ఓడరేవులు, ఇండస్ట్రియల్ హబ్ లు, వేర్ హౌస్ లు, కోల్డ్ స్టోరేజిలు కలిగిన ఆంధ్రప్రదేశ్ లో కనెక్టింగ్ మెర్క్స్ ఏర్పాటుచేయాలని విజ్థప్తి చేశారు.  ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఎగ్జిక్యూటివ్ లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.


ఈవై ఇండియా సిఇఓ, సిఐఐ ప్రెసిడెంట్ (డిజిగ్నేట్) రాజీవ్ మెమానితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... దేశంలోనే అతిపెద్ద ఐటి పూల్ కలిగిన ఎపిలో ఎఐ, డీప్ టెక్ పరిశోధనలపై దృష్టిసారించాం. రాష్ట్రంలో పెద్దసంఖ్యలో ఐటి నిపుణులు ఉన్నందున ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం/తిరుపతిలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయండి. ఐటిరంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో బ్యాకెండ్ ఐటి కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తే అక్కడఉన్న బలమైన మౌలిక సదుపాయాల ప్రయోజనాన్ని మీరు పొందే అవకాశముందని తెలిపారు. ఏపి ప్రభుత్వ విజ్ఞప్తిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాజీవ్ మెమాని తెలిపారు.


ఉబెర్ వైస్ ప్రెసిడెంట్ మధుకానన్ తో రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఐటి పర్యావరణ వ్యవస్థ, నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్, తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలను పెంచేందుకు విశాఖపట్నంలో రీజనల్ టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.  గత పదేళ్లలో ఉబెర్ సంస్థ డ్రైవర్స్ భాగస్వామ్యంతో 50వేల కోట్లరూపాయల వ్యాపారం చేసిందని తెలిపారు. ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని మధుకానన్ చెప్పారు.


ఫ్రెంచి సాఫ్ట్ వేర్ సంస్థ దసాల్డ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వర్జెలాన్ తో త్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు.  . ఎఐ, డీప్ టెక్ రంగాల అభివృద్ధికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ఎపిలోని విశాఖపట్నం/తిరుపతిలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ని ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద టాలెంట్ పదూల్ ఉన్నందున ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేయండి. MSME, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి ఎపి ప్రభుత్వంతో కలసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటులో భాగస్వామ్యం వహించాలని పిలుపునిచ్చారు. 2027నాటికి 1 బిలియన్ యుఎస్ డాలర్ల ఆదాయాన్ని భారత్ లో సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలపై కంపెనీ ఎగ్జిక్యూటివ్ లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
KCR Vs Revanth: రేవంత్ అసెంబ్లీ సవాల్ - కేసీఆర్‌ వెళ్తారా?
రేవంత్ అసెంబ్లీ సవాల్ - కేసీఆర్‌ వెళ్తారా?
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
Telangana Assembly Sessions: ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
Embed widget