Sri Ramanavami Brahmotsavams: మార్చి 26 నుంచి ఏప్రిల్ 05 వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు!
Tirupati/Ontimitta: మార్చి 26 నుంచి ఏప్రిల్ 05 వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.. ఈ రోజు ఏం జరుగుతుంది? పూర్తి వివరాలు చూద్దాం...

Sri Ramanavami Brahmotsavams of Sri Kodandarama Swamy Temple : మార్చి 26 గురువారం నుంచి ఏప్రిల్ 05 ఆదివారం వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఏప్రిల్ 1 సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగుతుంది
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మార్చి 26 నుంచి ఏప్రిల్ 05 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలో మార్చి 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 26న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రోజూ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు కన్నులపండువగా నిర్వహిస్తారు
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరంగా
2026 మార్చి 27 శుక్రవారం ఉదయం 9.30 నుంచి 10.15 గంటల వరకు వృషభ లగ్నంలో ధ్వజారోహణం
ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు శ్రీరామనవమి ఆస్థానం
సాయంత్రం 4 గంటల నుంచి పోతన జయంతి, కవి సమ్మేళనం జరుగుతుంది
ఇదే రోజు రాత్రి శేష వాహనంపై స్వామివారు విహరిస్తారు
మార్చి 28 శనివారం ఉదయం వేణుగానాలంకారం, శనివారం రాత్రి హంస వాహన సేవ
మార్చి 29 ఆదివారం ఉదయం వటపత్రశాయి అలంకారం, ఆదివారం రాత్రి సింహ వాహన సేవ
మార్చి 30 సోమవారం ఉదయం నవనీత కృష్ణాలంకారం, సోమవారం రాత్రి హనుమంత వాహన సేవ
మార్చి 31 మంగళవారం ఉదయం మోహినీ అలంకారం, మంగళనాపం రాత్రి గరుడవాహనసేవ జరుగుతుంది
ఏప్రిల్ 1 బుధవారం ఉదయం శివధనుర్భాణ అలంకరణ, మధ్యాహ్నం 03.15 గంటలకు కాంత కోరిక, ఎదుర్కోలు ఉత్సవం. ఇదే రోజు సాయంత్రం 06.30 గంటల నుంచి 08.30 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం, ఈ రోజు రాత్రి గజవాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు
ఏప్రిల్ 02 గురువారం ఉదయం రథోత్సవం
ఏప్రిల్ 03 శుక్రవారం ఉదయం కాళీయమర్ధనాలంకారం, రాత్రి అశ్వవాహన సేవ జరుగుతుంది
ఏప్రిల్ 04 శనివారం ఉదయం చక్రస్నానం...రాత్రి ధ్వజావరోహణం.
ఏప్రిల్ 05వ తేదీ ఆదివారం సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు
2026 మార్చి 27 శుక్రవారం శ్రీరామనవమి, భద్రాచల క్షేత్రంలో సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుంది. పౌర్ణమి రోజు ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది
డప జిల్లా ఒంటిమిట్టలో ప్రసిద్ధి కోదండరామాస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. సాధారణంగా నవమి రోజు కాకుండా చైత్ర పౌర్ణమి రోజు అంటే..నవమి తర్వాత దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్థశి ముగిసిన తర్వాత పౌర్ణమి రోజు వెన్నెల వెలుగులో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. ఏపీ ప్రభుత్వం ఈ వేడుకను అధికారికంగా నిర్వహిస్తుంది
ఈ ఏడాది ఏప్రిల్ 1 న నిండు పౌర్ణి రాత్రి వెన్నెల వెలుగుల్లో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తాయి. బ్రహ్మోత్సవాలు మార్చి 27 నుంచి ప్రారంభమవుతాయి.. ముందు రోజు మార్చి 26న అంకురార్పణతో ఉత్సవాలు మొదలవుతాయి.
రెండో భద్రాద్రిగా పిలిచే ఒంటిమిట్టలో రామచంద్రుడు.. సీతా, లక్ష్మణులతో కొలువై ఉంటాడు. ఈ ఆలయంలో ఆంజనేయుడు ఉండడు.
ఉగాది 2026 పరాభవ నామసంవత్సరంలో మీ రాశి ఆదాయం - వ్యయం తెలుసుకోండి!
2026 ఉగాది ఎప్పుడు? రాబోతున్న తెలుగు సంవత్సరం పేరేంటో తెలుసా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















