అన్వేషించండి

Vijaya brand controversy: విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు

Vijaya brand: విజయా బ్రాండ్ పేరుతో కల్తీ పాలు నెయ్యి తెలంగాణలో అమ్ముతున్నారని గుత్తా అమిత్ రెడ్డి ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో విజయ బ్రాండ్ ను ఫ్రాంచైజీలు ఇవ్వడం వల్లే ఇలా జరుగుతోందన్నారు.

Adulterated milk ghee under the name of Vijaya brand:  తెలంగాణ పాడి రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ,  ప్రైవేట్ వ్యక్తులు  విజయ  బ్రాండ్ పేరుతో కల్తీ పాలు, నెయ్యి విక్రయిస్తున్నారంటూ తెలంగాణ డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సికింద్రాబాద్‌లోని విజయ డైరీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో వైసీపీ  ప్రభుత్వం ప్రైవేట్ ఫ్రాంచైజీలకు అనుమతులు ఇవ్వడం వల్ల మార్కెట్లోకి నాణ్యత లేని ఉత్పత్తులు వస్తున్నాయని, ఇది ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటమేనని మండిపడ్డారు.

ప్రైవేట్ చేతుల్లో 'విజయ' బ్రాండ్ – పెను ప్రమాదం 

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయ బ్రాండ్‌ను ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీలుగా ఇవ్వడం వల్ల తీవ్ర అనర్థాలు జరుగుతున్నాయని అమిత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా మేఘన ఫుడ్స్  అనే సంస్థకు ఫ్రాంచైజీ ఇవ్వగా, వారు గుజరాత్‌లో నెయ్యి తయారు చేసి తెలంగాణలో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసినట్లు నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) నివేదిక ఇచ్చిందని ఆయన వెల్లడించారు. నెలకు సుమారు 100 టన్నుల కల్తీ నెయ్యి హైదరాబాద్ మార్కెట్లో అమ్ముడవుతోందని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

 తెలంగాణ పాడి రైతులకు తీరని అన్యాయం 

తెలంగాణ విజయ డైరీకి ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ఏపీకి చెందిన ప్రైవేట్ యూనియన్లు ఇక్కడ తక్కువ నాణ్యత గల పాలను విక్రయిస్తున్నాయని చైర్మన్ ధ్వజమెత్తారు. పాల ప్యాకెట్లపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ప్రైవేట్ కంపెనీల వివరాలు వస్తున్నాయని, దీని వల్ల స్థానిక పాడి రైతులకు రావాల్సిన ఆదాయం గండిపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నెల్లూరు, కర్నూలు యూనియన్లు విజ్ఞప్తి మేరకు  విజయ పేరు వాడటం నిలిపివేసినా, కొన్ని ప్రైవేట్ శక్తులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని స్పష్టం చేశారు.

 ఏపీ ప్రభుత్వం స్పందించాలని గుత్తా అమిత్ రెడ్డి విజ్ఞప్తి 

డైరీ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ బ్రాండ్లను వాడుకోవడానికి వీల్లేదని, ఈ విషయమై ఏపీ డైరీకి ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదని అమిత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కల్తీ పాలు, నెయ్యి వ్యవహారంపై ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలోనూ చర్చ జరుగుతోందని, అక్కడి ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పాడి రైతుల ప్రయోజనాల కోసం తాము ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, కల్తీ ఉత్పత్తులను అడ్డుకోవడానికి తనిఖీలు ముమ్మరం చేస్తామని ఆయన హెచ్చరించారు. 


  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget