అన్వేషించండి

Instagram Update : ఇన్​స్టాగ్రామ్​లో న్యూ ఫీచర్స్.. ఇకపై మూడు నిమిషాల నిడివి ఉన్న రీల్స్ పోస్ట్ చేయవచ్చట, మరో అప్​డేట్ కూడా

ఇన్​స్టాగ్రామ్ రీల్స్ చూడనిదే రోజు గడవదు. ఇప్పుడు అలాంటి రీల్స్​ని నిడివి పెంచుతూ న్యూ ఫీచర్​ని ప్రకటించింది ఇన్​స్టాగ్రామ్. 

Instagram New Features : ఉదయం లేచినప్పటి నుంచి.. సాయంత్రం పడుకునేవరకు చాలామంది సీరియస్​గా చేసే సిల్లీ పని ఏంటంటే ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్ చూడడం. సమయాన్ని తినేస్తుందని తెలిసినా కూడా రీల్స్​ని స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఆఖరుకు నిద్రను ఆపుకొని మరీ రీల్స్ చూసేవాళ్లు ఉన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్​స్టాగ్రామ్ న్యూ అప్​డేట్​తో వచ్చేసింది. ఆ ఆప్షన్ రీల్స్ చేసేవారికి మంచి బెనిఫిట్​నే ఇవ్వనుంది. 

ఇన్​స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్​ని మారుస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు వినియోగదారులు మూడు నిమిషాల పాటు వీడియోలను రీల్ రూపంలో అప్​లోడ్ చేసేందుకు వీలు ఇస్తున్నట్లు తెలిపింది. ముందుకంటే రీల్స్ డ్యూరేషన్​ను మరో 90 సెకన్లు రెట్టింపు చేసుకునే సౌలభ్యం అందించింది. యూజర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఈ మార్పు చేసినట్లు ఇన్​స్టాగ్రామ్​ హెడ్ ఆడమ్ మోస్సేరి తెలిపారు. 

వ్యూహాత్మక మార్పు.. 

గతంలో ఈ రీల్స్ నిడివిని పెంచమని తెలిపిన మోస్సేరి ఇప్పుడు ఈ అప్​డేట్​ని తెచ్చారు. యూజర్​ని ఎక్కువసేపు రీల్స్ చూస్తూ ఎంగేజ్​ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఫీచర్​ని తెచ్చినట్లు తెలుస్తుంది. ఇన్​స్టాగ్రామ్ వ్యూహంలో ఇది ప్రధాన మార్పుగా కనిపిస్తుంది. అయితే యూఎస్​లో టిక్​టాక్​ బ్యాన్ అవ్వడంతో.. దానిని క్యాష్ చేసుకునేందుకు ఈ మార్పును తెచ్చినట్లు కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే టిక్​టాక్​లో మూడు నిమిషాల నిడివి వీడియోలు ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు టిక్​టాక్ బ్యాన్ కావడంతో ఆ ఫీచర్​ని ఇన్​స్టాలో ఉపయోగించుకునే వెసులుబాటు తెచ్చినట్లు తెలుస్తుంది. ఇన్​స్టాగ్రామ్ రీల్స్ నిడివిని  90 సెకన్లకు పెంచి.. రెండు సంవత్సరాలైంది. ఈ నిడివిని 10 నిమిషాలకు పెంచాలని చూసింది కానీ.. దానిపై పూర్తి వ్యతిరేకత వచ్చింది. 

లే అవుట్​లో మార్పులు 

ఇన్​స్టాగ్రామ్ ప్రొఫైల్ లేఅవుట్​లో కూడా మార్పులను ఇన్​స్టా తీసుకొచ్చింది. రీల్స్ ఎక్కువ చేయడంతో పాటు.. యూజర్ ప్రొఫైల్స్​ను క్లాసిక్ స్క్వేర్ గ్రిడ్  నుంచి దీర్ఘచతురస్రాకారం(rectangular)గా మారుస్తోంది. దీనివల్ల అప్​లోడ్ చేసిన కంటెంట్ ఫోటోలు, వీడియోలు వర్టికల్​గా మారనున్నాయి. 

ఫ్రెండ్స్ యాక్టివిటీ.. 

రీసెంట్​గా ఇన్​స్టా న్యూ ఫీచర్​ని తీసుకువచ్చింది. ఫ్రెండ్స్ లేదా ఇష్టమైన వ్యక్తులు ఎలాంటి రీల్స్​ని లైక్​ చేస్తున్నారో పాప్స్ రూపంలో చూపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ మధ్య ఎంగేజింగ్ పెంచడంలో హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో తెచ్చినట్లు తెలిపారు. ఈ కొత్త ఫీచర్​ ద్వారా మీ ఫ్రెండ్స్ లైక్ చేసిన రీల్స్​కు మీరు కామెంట్లు, లైక్​లు ఇవ్వొచ్చు. అలాగే రీల్స్ ట్యాబ్​కు పైన కుడి వైపున ఉన్న బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ ఏమి చేస్తున్నారో యాక్సెస్ చేయవచ్చు. ఇది మిమ్మల్ని వారి ఫీడ్​కు తీసుకువెళ్తుంది. 

ఈ మార్పుల వల్ల ఇన్స్​స్టాలో యూజర్స్ ఎంగేజ్ అయ్యే అవకాశంతోపాటు.. ప్రైవసీని, సమయాన్ని కోరుకునేవారు వెళ్లిపోయే ప్రమాదం కూడా అంతే ఉందంటూ ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పటికే రీల్స్​కి అడిక్ట్ అయినవారి పరిస్థితి మరింత దిగజారవచ్చని కూడా భావిస్తున్నారు. 

Also Read : పేరెంట్స్ అలెర్ట్.. మీ పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడుతుంటే జాగ్రత్త, న్యూ రూల్స్​తో షాక్​ ఇవ్వబోతున్న గవర్నమెంట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Highest Scores: రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
SRH Vs RR Result Update:  స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. ఈ సీజ‌న్లో సొంత‌గ‌డ్డ‌పై గెలిచిన‌ తొలి జ‌ట్టు.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
Kishan Reddy: డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP DesamCSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP DesamSRH vs RR IPL 2025 Match Preview | రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొట్టనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Highest Scores: రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
SRH Vs RR Result Update:  స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. ఈ సీజ‌న్లో సొంత‌గ‌డ్డ‌పై గెలిచిన‌ తొలి జ‌ట్టు.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
Kishan Reddy: డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
Ghajini 2: 'గజిని 2' కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తోన్న డైరెక్టర్ మురుగదాస్! - సీక్వెల్ క్లారిటీతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..
'గజిని 2' కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తోన్న డైరెక్టర్ మురుగదాస్! - సీక్వెల్ క్లారిటీతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..
Gayatri Bhargavi: ఆ థంబ్‌నైల్స్‌ ఏంటి? ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయన బతికే ఉన్నారు - నటి గాయత్రి భార్గవి
ఆ థంబ్‌నైల్స్‌ ఏంటి? ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయన బతికే ఉన్నారు - నటి గాయత్రి భార్గవి
RR vs SRH Ishan Kishan Century: ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ, లీగ్ చరిత్రలో సన్ రైజర్స్ రికార్డు స్కోరు
ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ, లీగ్ చరిత్రలో సన్ రైజర్స్ రికార్డు స్కోరు
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వ్యవహారం - బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై ఫిర్యాదు!
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వ్యవహారం - బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై ఫిర్యాదు!
Embed widget