అన్వేషించండి

1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్

New Rules March 2026: మార్చి 1 నుండి అమల్లోకి వచ్చే ఈ మార్పుల ప్రభావం ఇకపై మీ వాలెట్‌కే పరిమితం కాదు. మొబైల్ ఫోన్లు, బ్యాంకింగ్, రైలు ప్రయాణాలపై కూడా ప్రభావం చూపుతుంది.

New Rules March 2026: మార్చి 1వ తేదీ నుంచి అంటే నేటి (ఆదివారం) నుండే పలు ముఖ్యమైన మార్పులు అమలులోకి రాబోతున్నాయి. వీటి ప్రభావం సామాన్యుడి జేబుపై పడనుంది. ఈ మార్పులలో SIM బైండింగ్ నుండి LPG ధరల సమీక్ష, రైల్వే టికెట్ బుకింగ్ వంటి పలు అంశాలు ఉన్నాయి. మొత్తంగా వీటి ప్రభావం కేవలం మీ వాలెట్‌కే పరిమితం కాకుండా, మొబైల్ ఫోన్, బ్యాంకింగ్ సేవలు, రైలు ప్రయాణాలపై కూడా పడుతుంది. మీరు డిజిటల్ పేమెంట్స్ చేసినా, గ్యాస్ సిలిండర్ కొన్నా లేదా రైలులో ప్రయాణించే వారైనా ఈ అప్‌డేట్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం.-

సిమ్ బైండింగ్ రూల్

మెసేజింగ్ యాప్‌లకు సంబంధించిన ఈ మార్పు మార్చి 1 నుండి అమలులోకి వస్తుంది. కొత్త SIM బైండింగ్ నిబంధనల ప్రకారం, ఇకపై WhatsApp, టెలీగ్రామ్ (Telegram) లేదా Signal వంటి యాప్‌లు మీ యాక్టివ్ SIM కార్డ్‌తో అనుసంధానమై మాత్రమే ఉండాలి. మీ ఫోన్ నుండి సిమ్ తీసివేస్తే, ఈ యాప్‌లన్నీ పనిచేయడం ఆగిపోతాయి. గతంలో ఇలా ఉండేది కాదు. ఇప్పటి వరకు మొబైల్ వినియోగదారులు సిమ్ లేకుండా కూడా వాట్సాప్ వంటి పలు మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించేవారు. డిజిటల్ ఫ్రాడ్‌లను అరికట్టడమే దీని వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యం. ఇటీవలి సంవత్సరాలలో SIM స్వాప్,  నకిలీ రిజిస్ట్రేషన్ల మోసాలు పెరిగాయి. అందుకే యాక్టివ్ SIM లేకుండా మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించలేరు. దీనితో పాటు WhatsApp Web వంటి డెస్క్‌టాప్ వెర్షన్‌లు కూడా ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోతాయి.

రైలు టికెట్ బుకింగ్

జనరల్ టికెట్, ప్లాట్‌ఫారమ్ టికెట్, సీజన్ టికెట్ బుక్ చేసుకునే నిబంధనలు కూడా 1 మార్చి 2026 నుండి మారాయి. ఇప్పుడు రైలు టికెట్ బుక్ చేసుకోవడానికి కొత్త Rail One Appను ఉపయోగించాలి. పాత UTS (Unreserved Ticketing System) మొబైల్ యాప్ నిలిపివేశారు. అటువంటి పరిస్థితిలో మీ పాత UTS వాలెట్‌లో ఉన్న డబ్బును అదే మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయడం ద్వారా కొత్త యాప్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

LPG సిలిండర్ ధర

19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ (LPG Cylinder) ధరల్లో 28 నుంచి 31 రూపాయల వరకు తగ్గించారు. ఢిల్లీలో ఇప్పుడు వీటి కొత్త ధర 1740.50 రూపాయలు. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 49 రూపాయలు పెరిగి 1,961.50 కాగా, 14.2 కేజీల సిలిండర్ ధర రూ.905 గా ఉంది. ప్రతి నెలా మొదటి తేదీ మాదిరిగానే, మార్చి ఒకటో తేదీన కూడా చమురు కంపెనీలు వంట గ్యాస్, కమర్షియల్ సిలిండర్ల ధరలను సమీక్షించాయి. ముడి చమురు ధరలు, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హెచ్చుతగ్గుల ఆధారంగా ధరలు నిర్ణయిస్తారు. 

బ్యాంకింగ్, UPI నిబంధనలలో మార్పు

UPIకి సంబంధించిన నిబంధనల ప్రకారం, ఇకపై పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేటప్పుడు కేవలం పిన్ (PIN) మాత్రమే కాకుండా, బయోమెట్రిక్ లేదా మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేయాలని భావించారు. ఇది కాకుండా, కొన్ని ప్రభుత్వ బ్యాంకులలో Minimum Balance మెయింటైన్ చేయనందుకు విధించే జరిమానా నిబంధనలను మార్చారు. దీనివల్ల కస్టమర్లకు ఉపశమనం లభించనుంది. 

అద్దెదారులు, యజమానుల కోసం నిబంధనలు

2025-26 కోసం ప్రతిపాదిత కొత్త అద్దె నిబంధనల ప్రకారం, మార్చి 1 నుండి కొత్త అగ్రిమెంట్లలో కొన్ని మార్పులు చేయవచ్చు. దీని ప్రకారం అద్దె ఒప్పందం (Rent Agreement) డిజిటల్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు తప్పనిసరి. సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో ఇప్పుడు గరిష్టంగా 2 నెలల అద్దెను మాత్రమే తీసుకోవచ్చు. ఇంటి యజమానులు 24 గంటల ముందు నోటీసు ఇవ్వకుండా ఇంటికి రాలేరు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Post Office RD Scheme: మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget