ఈ రోజుల్లో ఇన్​స్టాగ్రామ్ అందరూ ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.

ఫేక్ ప్రొఫైల్స్​ నుంచి ఎవరైనా మీరు తెలుసంటూ మెసేజ్ చేసినా, డబ్బులు అడిగినా(Catfishing) అలెర్ట్ అవ్వాలి.

ఎవరైనా మిమ్మల్ని తిట్టినా.. బెదిరింపులకు పాల్పడినా ఇన్​స్టాగ్రామ్ సపోర్ట్ టీమ్​కి రిపోర్ట్ చేయాలి.

ఇన్​స్టాలో కనిపించే లింక్స్, ఎవరైనా మెసేజ్ రూపంలో పంపే లింక్స్​ని క్లిక్​ చేయకపోవడమే మంచిది.

ఇతరులతో ఎప్పుడూ మిమ్మల్ని పోల్చుకోకండి. ఇన్​స్టాలో కనిపించేదంతా నిజం కాదు.

ఎవరి బిహేవేయర్ అయినా నచ్చకున్నా, చెడుగా మాట్లాడుతున్నా వారిని బ్లాక్ లేదా రిపోర్ట్ చేయండి.

మీ పర్సనల్ డిటైల్స్, అడ్రెస్, ఫోన్ నెంబర్స్ వంటివి షేర్ చేసుకోకపోవడమే మంచిది.

ఇన్​స్టాగ్రామ్​కి స్ట్రాంగ్ పాస్​వర్డ్ పెట్టుకోవాలి. ఎవరికి దీనిని షేర్ చేయకూడదు.

ఇన్​స్టా నుంచి థర్డ్ పార్టీ యాప్స్​కి యాక్సెస్ ఇవ్వకపోవడమే మంచిది.

సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ అంతా నిజమని నమ్మకండి.