అకేషనల్​గా, సోషియల్​గా డ్రింక్ చేస్తున్నారా? అమ్మయాలు అయితే మీరు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

ఆల్కహాల్​ తీసుకునే ముందు ఏమైనా ఫుడ్ తినండి. దీనివల్ల ఆల్కహాల్ ఎక్కువగా ఎక్కకుండా ఉంటుంది.

మీ ఫ్రెండ్స్, మీరు నమ్మిన వ్యక్తులు ఉన్నప్పుడు.. మీరు సేఫ్​ అనుకున్నప్పుడే తాగితే మంచిది.

లిమిట్​గా తాగండి. ఎక్కువగా తాగితే అనర్థాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇంటికి సేఫ్​గా వెళ్లగలరో లేదో.. తీసుకువెళ్లేవాళ్లు ఉన్నారో లేదో కూడా చూసుకోండి.

డ్రింక్ చేసేప్పుడు ఒకేసారి కాకుండా స్లోగా, నిదానంగా తాగాలి.

ఆల్కహాల్ డీహైడ్రేషన్ చేస్తుంది కాబట్టి.. నీటిని ఎక్కువగా తీసుకోండి. ఇది హెల్త్​కి మంచిది.

మీకు ఎవరైనా డ్రింక్ ఆఫర్ చేస్తే.. అది కాదని చెప్పి వేరేది తీసుకుంటే మంచిది.

మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఇబ్బంది కలిగించేలా ఉంటే వెళ్లిపోండి.

ఫైనల్​గా బయటికెళ్లినప్పుడు ఆల్కహాల్ తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తీసుకున్న ఎవరికైనా మీ లోకేషన్, డిటైల్స్ షేర్ చేయండి.