చలికాలంలో వేధించే సమస్యల్లో తలనొప్పి ఒకటి. దీనిని తగ్గించుకునేందుకు ఇంటి చిట్కాలు ఫాలో అవ్వొచ్చు.

పాలు లేకుండా అల్లం టీ పెట్టుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

యూకలిప్ట్స్ ఆయిల్​ని ఇన్​హేల్ చేసినా.. లేదా స్టీమింగ్​ రూపంలో తీసుకున్నా మంచి ఫలితాలుంటాయి.

తలనొప్పిని కలిగే ప్రధానకారణాల్లో డీహైడ్రేషన్ ఒకటి. కాబట్టి పుష్కలంగా మంచినీటిని తాగండి.

మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్​ని డైట్​లో తీసుకుంటే తలనొప్పి లక్షణాలు తగ్గుతాయి.

డైయిరీ, సిట్రస్, గ్లూటన్ వంటి ఫుడ్స్ కొందరిలో తలనొప్పిని ట్రిగర్ చేస్తాయి. వాటికి దూరంగా ఉండండి.

డీప్ బ్రీతింగ్ చేయడం వల్ల తలనొప్పి తగ్గి.. మైండ్, బాడీ రిలాక్స్ అవుతుంది.

మసాజ్ వల్ల కూడా మైండ్ రిలాక్స్ అయ్యి తలనొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.

మెడిటేషన్, యోగా రెగ్యులర్​గా చేస్తూ ఉంటే తలనొప్పి ఎక్కువగా రాదు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.