చలికాలంలో కొన్ని డ్రింక్స్ రెగ్యూలర్‌గా తీసుకుంటే చలి దూరం కావడంతో పాటు.. కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అలాంటి వాటిలో అల్లం టీ ఒకటి. అల్లాన్ని ముక్కలు చేసినా, పొడితో అయినా టీ చేసుకుని తాగితే మంచిది. పరగడుపునే దీనిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. చలి తగ్గి శరీరంలో వేడి పుడుతుంది. లేదంటే అల్లం షాట్స్ కూడా తీసుకోవచ్చు. ఇది కీళ్లనొప్పులను, పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను దూరం చేస్తుంది. మధుమేహం, బీపీ సమస్యలు ఉన్నవారు కూడా అల్లం టీని రెగ్యూలర్‌గా తీసుకోవచ్చు. హైడ్రేటెడ్‌గా ఉండేందుకు నిమ్మరసం తీసుకున్నా మంచిదే. ఇది ఇమ్యూనిటీని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. నిమ్మరసంలోని విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అల్లం టీ అయినా, నిమ్మరసం అయినా మీరు దానిలో తేనె కలిపి తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. చలికాలంలో ఇలాంటి హెర్బల్ డ్రింక్స్ తాగడం వల్ల జలుబు, ఫ్లూ వంటి సమస్యలు రావు. నొప్పులు దూరమవుతాయి. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.