డివోర్స్

ఇండియాలో డివోర్స్ ఎక్కువ జరగడానికి రీజన్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: AI

వాటివల్లనే జరుగుతున్నాయట

ఈ మధ్యకాలంలో సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు డివోర్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇండియాలో దీనిని ప్రభావితం చేసే అంశాలేంటో ఇప్పుడు చూసేద్దాం.

Image Source: AI

ఆర్థిక ఇబ్బందులు

ఫ్యామిలీలోని ఆర్థిక ఇబ్బందులు, డబ్బుల విషయంలో వచ్చే అపార్థాలే విడాకుల్లో మేజర్ పాత్ర పోషిస్తున్నాయి.

Image Source: AI

కమ్యూనికేషన్

కూర్చొని మాట్లాడుకుంటే సగం సమస్యలు తగ్గిపోతాయి. కానీ సరైన కమ్యూనికేషన్ లేకుంటే ఎంత చిన్న సమస్య అయినా.. అది పెద్దగానే కనిపిస్తుంది. డివోర్స్​లో కమ్యూనికేషన్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది.

Image Source: AI

అఫైర్స్

పార్టనర్​కి తెలియకుండా మరొకరితో శారీరక సంబంధం పెట్టుకోవడం వల్ల కూడా డివోర్స్ రేటు పెరుగుతుంది.

Image Source: AI

రొమాన్స్

విడాకుల విషయంలో రొమాన్స్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందట. ఫిజికల్​గా దగ్గరగా లేకుంటే.. ఆ పెళ్లి ఎక్కువ కాలం నిలిచే అవకాశం లేదని చెప్తున్నారు నిపుణులు. ఇది మనుషులను దూరం చేసి విడాకులకు దారి తీస్తుంది.

Image Source: AI

పిల్లల పెంపకంలో..

పిల్లలను పెంచడంలో తల్లికి, తండ్రికి మధ్య మనస్పర్థలు రావొచ్చు. వీటివల్ల కూడా కొందరు విడిపోతున్నారు.

Image Source: AI

అలవాట్లు

మందు, జూదం, డ్రగ్స్, గ్యాంబ్లింగ్ వంటివి వ్యసనాలు పార్టనర్​కి ఉండడం వల్ల కూడా ఆ పెళ్లి.. విడాకుల వరకు వెళ్తోంది.

Image Source: AI

హింస

ఎమోషనల్​గా, ఫిజికల్​గా, బూతులు మాట్లాడుతూ ఇబ్బందులు పెడుతుంటే.. ఎదుటి వ్యక్తి సహించేవరకు మాత్రమే ఆ రిలేషన్ ఉంటుంది.

Image Source: AI

ఎక్స్​పెక్టేషన్స్

భర్త చేయలేనివి భార్య.. భార్య చేయలేనివి భర్త.. తరచుగా ఎక్స్​పెక్ట్ చేస్తూ ఉంటే.. దానిని భరించే ఓపిక లేదా చేసే ఓపిక నశిస్తుంది. తర్వాత వారు అదే కారణంతో విడిపోతూ ఉంటారు.

Image Source: AI