హనీమూన్ ఎందుకు వెళతారో తెలుసా!
హనీమూన్ గురించి ఇదేం అమాయకమైన ప్రశ్న అనుకోవద్దు..
గోవా, కేరళ, ఊటీ, స్విడ్జర్లాండ్, మాల్దీవ్స్..ఇలా ఎన్నో ప్రదేశాలు లిస్టౌట్ చేసి వాటిలో ఓ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారు
హనీమూన్ వెళ్లినప్పటి నుంచి వచ్చేవరకూ ముద్దులు, హగ్గులు, ఫొటోలతో సందడే సందడి...
ఇంతకీ హనీమూన్ ఎందుకు వెళ్లాలో ఎప్పుడైనా ఆలోచించారా అని క్వశ్చన్ చేస్తున్నారు పెద్దలు
హనీమూన్ కి వెళ్లెచ్చేలోగా ఇద్దరూ ఒకర్నొకరు పూర్తిగా అర్థంచేసుకోవాలి. కలకాలం తనతో ఉండేందుకు వచ్చిన భార్యకు భరోసా ఇవ్వాలి
నువ్వు పుట్టిన వాతావరణం ఏంటి - నీ జీవిత భాగస్వామి పుట్టిన వాతావరణం ఏంటి?
నువ్వు వెళ్లి భార్య ఇంట్లో ఉండడం లేదు..ఆమె వచ్చి నీ ఇంట్లో ఉంటోంది..అలాంటప్పుడు అర్థం చేసుకోవాల్సింది, భరోసా ఇవ్వాల్సిందే భర్తే
సాధారణంగా ఆడపిల్లలు పుట్టిల్లు దాటి అత్తారింట్లో అడుగుపెట్టేటప్పుడు వారికి కల్చరల్ షాక్ ఉంటుంది..దాన్నించి బయటకు తీసుకురావాలి
మీతో జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలి..అప్పుడే ఆ బంధం కలకాలం ఆనందంగా ఉంటుంది