బరువు తగ్గాలనుకునేవారు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. దీనిని ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు చూసేద్దాం. దీనిని ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు చూసేద్దాం. 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ని గ్లాస్ నీటిలో వేసి తీసుకోవచ్చు. భోజనానికి పావుగంట ముందు నుంచి అరగంటలోపు తీసుకుంటే ఫుడ్ మంచిగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా కడుపు నిండుగా ఉండేలా చేసి.. తక్కువగా తినేలా చేస్తుంది. మెటబాలీజంను పెంచి.. బరువు పెరగడంలో హెల్ప్ చేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు దూరమై యాక్టివ్గా ఉంటారు. కొందరు నీరు వల్ల బరువు ఎక్కువ కనిపిస్తారు. ఆ నీటిని తగ్గించి సన్నగా కనిపించేలా చేస్తుంది. బరువు తగ్గుతాము కదా అని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే తాగాలి. (Images Source : Envato)