నిద్ర తక్కువైతే గుండె సమస్యలు తప్పవు, జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri

ఇన్​ఫ్లమేషన్

నిద్రలేమి దీర్ఘకాలిక మంటకు దారి తీస్తుంది. ఇది రక్తనాళాలను దెబ్బతీసి గుండె జబ్బుల ప్రమదాన్ని పెంచుతుంది.

రక్తపోటు

దీర్ఘకాలికంగా నిద్రలేమితో ఇబ్బంది పడితే అది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. బీపీ గుండెపోటుకు ప్రధాన ప్రమాద కారకం.

కార్టియాక్ అరెస్ట్

నిద్రలేమి హార్ట్​బీట్​కు అంతరాయం కలిగిస్తుంది. ఇది క్రమేణా కార్టియాక్ అరెస్ట్​ ప్రమాదాన్ని పెంచుతుంది.

రోగనిరోధక శక్తి

నిద్రతగ్గితే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇది ఇన్​ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడేలా చేస్తుంది.

ఎంత నిద్ర అవసరమంటే..

రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల రాత్రి నిద్ర ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది హెల్తీగా ఉండేలా చేస్తుంది.

స్లీప్ షెడ్యూల్

రోజూ ఒకే టైమ్​కి నిద్ర వచ్చినా రాకున్నా బెడ్​ ఎక్కితే.. నిద్ర అనేది మీకు అలవాటు అయ్యే ఛాన్స్ ఉంది. ఆ సమయానికి మీరు పడుకోకున్నా నిద్ర వచ్చే అవకాశం పెరుగుతుంది.

ఫాలో అవ్వాల్సిన టిప్

యోగా, మెడిటేషన్, వ్యాయామం నిద్రను ప్రేరేపిస్తాయి. ఇవి ఒత్తిడిని దూరం చేసి నిద్రకు ఉపక్రమించేలా చేస్తాయి.

ఫోన్ వాడకం

మొబైల్స్, ల్యాప్​టాప్ వంటివి నిద్రపోయేముందు వాడకపోవడమే మంచిది. ఫోన్స్ ఉపయోగిస్తే మీకు నిద్ర దూరమవుతుంది.

అవగాహన కోసమే

ఇవి కేవలం అవగాహన కోసమే. దీర్ఘకాలిక నిద్రలేమి ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించండి.