నిద్రరాక చాలామంది స్లీపింగ్ పిల్స్ వేసుకుంటారు. కానీ ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలు తెస్తుందట.

పరిధికి మించి వీటిని వేసుకుంటే అవి అడిక్షన్​గా మారుతాయట. అవి లేకుండా నిద్రపోలేని పరిస్థితి వచ్చేస్తుంది.

బ్రీతింగ్ సమస్యలను పెంచి.. డిప్రెషన్​ను పెంచుతుంది. కొన్ని పరిస్థితుల్లో ఇది సూసైడ్​కి దారి తీస్తుంది.

కొందరిలో ఈ పిల్స్ అలెర్జీలను కలిగిస్తాయి. ఇవి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయట.

స్లీపింగ్ పిల్స్ వల్ల నిద్ర రావొచ్చు కానీ.. ఇవి పరిస్థితిని పూర్తిగా తీవ్రం చేస్తాయి. నిద్రను మొత్తానికి దూరం చేస్తాయి.

ఈ మందులు ఎక్కువగా వేసుకోవడం వల్ల మతిమరుపు పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పూర్తిగా దూరమవుతుంది.

తెలియకుండానే నిద్రలో నడవడం వంటి దారుణమైన పరిస్థితి ఏర్పడొచ్చు. రేర్​ కేస్​లలో ఇది జరుగుతుంది.

మతిస్థితిమితం ఏర్పడి వేరే కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఇది కూడా రేర్ కేస్​లలోనే జరుగుతుంది.

ఈ తరహా మెడిసిన్ తీసుకునేటప్పుడు కచ్చితంగా వైద్యుల సలహాలు తీసుకోవాలి.

వారు ఇచ్చిన సలహాలు, సూచనలు తూ.చ తప్పకుండా ఫాలో అయితే వాటి అవసరమే ఉండదు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.