Toxic Romantic Song : టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
Toxic Tabaahi Song : యశ్ హీరోగా నటించిన టాక్సిక్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది. యశ్, కియారా అడ్వాణీల రొమాంటిక్ ట్రాక్ రిలీజ్ డేట్ టైం అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్.

Yash's Toxic Romantic Track Tabaahi Song Release Date Time Locked : రాకింగ్ స్టార్ యశ్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో, టీజర్‌లో మోస్ట్ వయలెంట్ అండ్ రొమాంటిక్ యాంగిల్స్ చూపించారు. దీంతో ఫస్ట్ సాంగ్‌పై బిగ్ హైప్ క్రియేట్ అవుతోంది.
ఫస్ట్ సాంగ్ ఎప్పుడంటే?
ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ 'తుబాహీ'ని రిలీజ్ చేయనున్నారు. యశ్, కియారా అడ్వాణీ రొమాంటిక్ ట్రాక్‌గా ఈ పాట ఉండనున్నట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 12:59 గంటలకు సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా సాంగ్ కోసం అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. విశాల్ మిశ్రా ఈ పాటను స్వరపరిచి పాడారు.
మరోవైపు, ఈ పాట ఆన్‌లైన్‌లో లీక్ అయ్యిందంటూ కొందరు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అయితే, అది ఒరిజినల్ సాంగ్ కాదని ఏఐ జనరేటెడ్ వీడియో అని తెలుస్తోంది.
View this post on Instagram
Also Read : విరోష్ కపుల్ గొప్ప మనసు - ఫ్యాన్స్‌కు స్వీట్ సర్‌ప్రైజ్... ఆలయాల్లో అన్నదానం కూడా...
KGFను మించేలా యాక్షన్ సీక్వెన్స్, వయలెన్స్ ఉన్న టీజర్ కట్ ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తుండగా... మూవీపై అంచనాలు పదింతలయ్యాయి. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా... 'రాయ'గా యశ్ కనిపించనున్నారు. అలాగే, నదియా పాత్రలో కియారా అద్వానీ, ఎలిజిబెత్‌గా హ్యుమా ఖురేషీ, గంగ పాత్రలో నయనతార, రెబెకాగా తారా సుతారియా, మెలిసా పాత్రలో రుక్మిణి వసంత్ నటిస్తున్నారు.
స్టోరీ అదేనా?
అద్భుతమైన సముద్రం చుట్టూ నెలకొన్న నేర సామ్రాజ్యం, దాని చుట్టూ తిరిగే మాఫియా, సిండికేట్స్, వయలెన్స్ మధ్య ఓ సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడి మళ్లీ ఆ నేర సామ్రాజ్యానికే అతను లీడర్‌గా ఎలా ఎదిగాడు? అనేదే ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. 1940 - 70 గోవా బ్యాక్ డ్రాప్‌గా సాగే పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా 'టాక్సిక్'ను రూపొందిచినట్లు సమాచారం.
KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ టాక్సిక్ మూవీని నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా కన్నడతో పాటు తెలుగు, ఇంగ్లీష్, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
























