అన్వేషించండి

BR Naidu Deepfake Videos: టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్‌కు బీఆర్ నాయుడు ఫిర్యాదు

TTD Chairman BR Naidu | మహిళతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అవన్నీ డీప్ ఫేక్ వీడియోలు అంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.

అమరావతి: సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బి.ఆర్. నాయుడు తీవ్రంగా స్పందించారు. కొందరు వ్యక్తులు నకిలీ డీప్‌ఫేక్ వీడియోలను సృష్టించి, తన వ్యక్తిగత ప్రతిష్టను భంగపరచడమే కాకుండా, పవిత్రమైన టీటీడీ సంస్థ గౌరవాన్ని దిగజార్చేందుకు కుట్ర పన్నారని బీఆర్ నాయుడు ఆరోపించారు. ఈ మేరకు అప్రతిష్ట పాలు చేసేలా సాగుతున్న ఈ ప్రచారాన్ని అరికట్టాలని కోరుతూ ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర..

ఆధునిక AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ తన రూపాన్ని అనుకరించేలా కృత్రిమ వీడియోలను తయారు చేశారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మండిపడ్డారు. ఈ వీడియోల్లోని కంటెంట్ అంతా పూర్తిగా అసత్యమని, కావాలనే వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పక్కా పథకం ప్రకారం ఈ కుట్ర సాగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ వ్యక్తుల హస్తం ఉందని ఆరోపణలు..

ఈ దుష్ప్రచారం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని బి.ఆర్. నాయుడు ఆరోపించారు. ప్రధానంగా వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు తనపై ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, దీనిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని  హెచ్చరించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న ఇటువంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్ విభాగం తన ఫిర్యాదుపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ నాయుడు కోరారు.

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget