పాలకూర జ్యూస్ బెనిఫిట్స్

పాలకూరను జ్యూస్​ చేసుకుని తాగితే కలిగే బెనిఫిట్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

యాంటీఆక్సిడెంట్లు

పాలకూర జ్యూస్​లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, ఈ, బెటా కెరోటీన్ ఉంటాయి. ఇవి కణాలను డ్యామేజ్ చేయకుండా, ఇన్​ఫ్లమేషన్​ను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

కంటి ఆరోగ్యానికి

పాలకూర జ్యూస్​లో ల్యూటిన్, జియాక్సంతిన్​తో నిండి ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వయసు సంబంధిత కంటి సమస్యలను దూరం చేస్తాయి.

బోన్ హెల్త్​కి

ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు పాలకూర జ్యూస్​ తాగాలి. దీనిలో కాల్షియం, విటమిన్ కె, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి బోన్స్ స్ట్రాంగ్​గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి.

క్యాన్సర్ దూరం

పాలకూరలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ క్యాన్సర్​కు వ్యతిరేకంగా పోరాడతాయి. ముఖ్యంగా పెద్దపేగు, ప్రోస్టెట్, బ్రెస్ట్ క్యాన్సర్​ని ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

జీర్ణసమస్యలు దూరం

ఫైబర్, ఇతర పోషకాలతో నిండిన పాలకూర మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. గట్ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది. హెల్తీ బ్యాక్టిరియాను పెంచి.. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

బీపీ కంట్రోల్

బీపీ ఎక్కువగా ఉండేవారు రోజూ పాలకూర జ్యూస్​ని తీసుకుంటే మంచిది. దీనిలోని పోటాషియం, కాల్షియం, మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

హెల్తీ స్కిన్

స్కిన్​ను హెల్తీగా ఉంచడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు స్కిన్ డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తాయి. వృద్ధాప్యఛాయలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

రోగనిరోధక శక్తికై..

పాలకూరలోని విటమిన్ సి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులను ఇది దూరం చేసి హెల్తీగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రోజుకు అరకప్పుతో ప్రారంభించాలి. క్రమంగా డోస్ పెంచుకోవచ్చు. ఫ్రెష్ పాలకూర జ్యూస్​కి మంచిది. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుని ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.