సింగినాదం జీలకర్ర అంటే ఏంటి!

Published by: RAMA

సింగినాదం అంటే?

జీలకర్ర అంటే తెలుసు మరి సింగినాదం అంటే?

ఓ వాద్య పరికరం..

సింగినాదం అంటే ఆటవికుల చేతిలో ఉండే ఓ వాద్య పరికరం..దీన్ని దుప్పి కొమ్ముతో తయారు చేస్తారు

ఓడ వచ్చిందోచ్!

అప్పట్లో ఓడరేవుకి సరుకుల ఓడ చేరుకోగానే ఆ విషయం తెలియజేస్తూ ఓ శంఖారావం లాంటి శబ్ధం చేసేవారు...అదే సింగినాదం

జీలకర్ర వచ్చిందిలే..

ప్రత్యేకంగా ఓ ఓడ మాత్రం ప్రతిసారీ జీలక్రతోనే వచ్చేది..ఆ రోజుల్లో మాత్రం సింగినాదం వినిపడినా పట్టించుకునేవారు కాదు

సింగినాదం జీలకర్ర

ఆ ఏముందిలే..సింగినాదం జీలకర్రే కదా అనుకునేవారు..అలా పుట్టిందే సింగినాదం జీలకర్ర అనే సామెత

శృంగనాదం

సంస్కృతంలో శృంగం అంటే కొమ్ము అని అర్థం..ఆ శృంగనాదమే వాడుక భాషలో సింగినాదం అయింది

జీలకర్రే...

గిరిజన ప్రాంతాల్లో జీలకర్ర అమ్మేవారు ఈ శృంగనాదం చేస్తూ వచ్చేవారట..ఆ శబ్ధం వినగానే జీలకర్రలే అని పట్టించుకునేవారు కాదట

దొంగల భయం

ఒకప్పుడు దొంగలు.. సింగినాదం ఊదుతూ జనాల్ని భయభ్రాంతులకు గురిచేసి దోచుకెళ్లేవారట...

దొంగలు కాదు జీలకర్ర

ఆ తర్వాత జీలకర్ర వ్యాపారులు ఇదే శబ్దం చేస్తూ రావడంతో... ఆ సింగినాదం జీలకర్రలే అని అనుకునేవారట.

హడావుడి అవసరం లేదు..

అలా..పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేని విషయాలకు సింగినాదం జీలకర్ర అనే పదాన్ని వాడడం ప్రారంభించారు