మిరియాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందించడంతో పాటు.. నిద్రను మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయట.

అందుకే మీ డైట్​లో ముఖ్యంగా డిన్నర్​లో మిరియాలు ఉండేలా చూసుకోవాలంటున్నారు.

ఇవి ఒత్తిడిని తగ్గించి రిలాక్స్ అందించడంతో పాటు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయట.

నిద్రకు ముందు వేడి నీళ్లలో మిరియాల పొడి వేసి.. దానిని మరిగించి తీసుకున్నా మంచి ఫలితాలుంటాయి.

పెప్పర్ ఎసెన్సిషయల్ అరోమా థెరపీ కూడా నిద్ర క్వాలిటీని పెంచడంలో హెల్ప్ చేస్తుంది.

మిరియాలలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది స్ట్రెస్​ని తగ్గించి.. విశ్రాంతిని అందిస్తుంది.

ఇన్​ఫ్లమేషన్​ను తగ్గించి.. నిద్ర సమస్యలను దూరం చేస్తుంది. గుండె సమస్యలు తగ్గుతాయి.

వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యంతో పాటు నిద్రను మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి.

అయితే మీరు మిరియాలు తీసుకునేప్పుడు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

డైట్​లో వీటిని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు తక్కువతో మొదలు పెట్టి దానిని పెంచుకుంటూ వెళ్లాలి.