Fact Chek KCR News: కేసీఆర్ అమెరికాలో సెటిల్ అవుతున్నారా..? ఆ పేరుతో వస్తున్న న్యూస్ క్లిప్‌లు నిజమేనా.. ?
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అమెరికా వెళ్లిపోతున్నారని జరుగుతున్న ప్రచారం తప్పు. తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ అనే ఈ- పేపర్ లేదు; ఆ పేరుతో వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్పింగ్స్ ఫేక్

కేసీఆర్ అమెరికాలో సెటిల్ అవుతున్నారా..? ఆ పేరుతో వస్తున్న న్యూస్ క్లిప్‌లు నిజమేనా.. ?
Fact Chek KCR NEWS: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రత్యక్ష రాజకీయల నుంచి తప్పుకొని అమెరికాలో స్థిరపడుతున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కకరికి రూ.1000 కోట్లు ఆఫర్ చేసినట్లు “తెలంగాణ న్యూస్ టుడే డైలీ” పేరుతో ఉన్న రెండు ఈ- పేపర్ క్లిప్‌లు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ప్రచారంలో ఉన్నాయి. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ పేరుతో ప్రచారమవుతున్న ఈ- పేపర్ కథనాలు.
ఫాక్ట్: ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ పేరుతో ఎటువంటి ఈ- పేపర్ లేదు. వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లలో పేర్కొన్న ‘telangananewstodaydaily.com’ డొమైన్ ఇంకా రిజిస్టర్ కాలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్ అయ్యి అమెరికాలో స్థిరపడుతున్నట్లు విశ్వశనీయ మీడియా కథనాలు కానీ అధికారిక సమాచారం కానీ మాకు లభించలేదు. అలాగే కేసీఆర్ తమకు వెయ్యి కోట్లు ఆఫర్ చేసినట్లు కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగా ఉన్న మీడియా కథనాలు కూడా మాకు లభించలేదు. ఇక వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లో పేర్కొన్న “తెలంగాణ న్యూస్ టుడే” గురించి ఇంటర్నెట్లో వెతకగా ఈ పేరుతో ఉన్న ఎటువంటి ఈ- పేపర్ లభించలేదు.
Also Read: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
స్థానిక ఈ- పేపర్లను పబ్లిష్ చేసే ‘Readwhere’ & ‘Magzter’ వంటి వెబ్సైట్లలో కూడా ఈ పేరుతో ఎటువంటి ఈ- పేపర్ లేదు. ఇక న్యూస్ క్లిప్పింగ్‌లలో ఇచ్చిన లింకులు(ఇక్కడ & ఇక్కడ) కూడా మనుగడలో లేనట్లు గుర్తించాం.
ఇక ‘telangananewstodaydaily.com’ అనే డొమైన్ (వెబ్సైట్ యొక్క అడ్రస్) గురించి వివిధ డొమైన్ రిజిస్ట్రీ డేటాబేస్‌లలో వెతకగా ఈ పేరుతో ఎటువంటి డొమైన్ రిజిస్టర్ కాలేదని, ప్రస్తుతం అమ్మకానికి ఉందని తెలిసింది.
This story was originally published by Factly as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction, this story has not been edited by ABP DESAM staff.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

