అన్వేషించండి

US Israel Strikes On Iran: దుబాయ్‌లో చిక్కుకున్న 'లెజెండ్' హీరోయిన్... ప్రధాని మోడీ సాయం కోరుతూ పోస్ట్

Sonal Chauhan Stuck In Dubai: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ సరసన 'లెజెండ్', 'డిక్టేటర్', 'రూలర్' సినిమాల్లో నటించిన హీరోయిన్ సోనాల్ చౌహన్. ఇరాన్ మీద అమెరికా - ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో మోదీ సాయం కోరారు.

హీరోయిన్ సోనాల్ చౌహన్ (Sonal Chauhan) గుర్తు ఉన్నారా? గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణతో మూడు సినిమాలు చేశారు. 'లెజెండ్', 'డిక్టేటర్', 'రూలర్' సినిమాల్లో నటించారు. రామ్ పోతినేనితో 'పండగ చేస్కో' చేశారు. ఇప్పుడీ అందాల భామ దుబాయ్‌లో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే... 

ఇరాన్ మీద ఇజ్రాయెల్ & అమెరికా యుద్ధం నేపథ్యంలో దుబాయ్‌ ఎయిర్‌ పోర్ట్‌లో పలు విమానాలు క్యాన్సిల్ చేశారు. దాంతో చాలా మంది ప్రయాణికులు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. దుబాయ్‌లో తమ ఇంటి పైనుంచి రాకెట్ లాంచర్లు వెళ్లిన వీడియో షేర్ చేశారు హీరో విష్ణు మంచు. హీరోయిన్ సోనాల్ చౌహాన్ సైతం ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహాయం కోరుతూ ఆమె ఓ పోస్ట్ చేశారు.

దుబాయ్‌లో చిక్కుకున్న సోనాల్ చౌహాన్

సోనాల్ చౌహాస్ శనివారం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేశారు. ''గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ గారికి... నేను ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. వార్ టెన్షన్ మధ్య చిక్కుకున్నాను. విమానాలు క్యాన్సిల్ చేశారు. ఇండియాకు తిరిగి రావడానికి స్పష్టమైన దారి కనిపించడం లేదు. సురక్షితంగా ఇంటికి (ఇండియాకు) తిరిగి రావడానికి సహాయం చేయమని కోరుతున్నాను. భారత ప్రభుత్వ మార్గదర్శకత్వం, మద్దతు కోరుకుంటున్నా. సురక్షితంగా తిరిగి రావడానికి నేను ఎదురు చూస్తున్నా... థాంక్స్‌'' అని సోనాల్ పేర్కొన్నారు.

డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, తెలుగు అమ్మాయి పీవీ సింధు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆమె కూడా దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సింధు సైతం ఓ పోస్ట్ చేశారు. ''తదుపరి సమాచారం వచ్చే వరకు అన్ని విమానాలు నిలిపివేశారు'' అని ఆమె తెలిపారు.

Also ReadVijay Trisha Relationship: త్రిషతో దళపతి విజయ్ ఎఫైర్... విడాకుల నేపథ్యంలో ఆధారాలు బయటకొచ్చాయా?

US Israel Strikes On Iran: దుబాయ్‌లో చిక్కుకున్న 'లెజెండ్' హీరోయిన్... ప్రధాని మోడీ సాయం కోరుతూ పోస్ట్

హిందీలో 'జన్నత్'తో సోనాల్ చౌహాన్‌కు గుర్తింపు

సోనాల్ చౌహాన్ హిందీ సినిమాల గురించి చెప్పాలంటే... త్వరలో 'మిర్జాపూర్' సినిమాలో ఆమె కనిపించనున్నారు. సోనాల్ 2008లో విడుదల అయిన 'జన్నత్' సినిమాతో గుర్తింపు పొందారు. ఆమె బాలీవుడ్ ఫస్ట్ సినిమా అది. దాంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఆ తర్వాత తెలుగు సినిమా 'రెయిన్‌బో'లో కనిపించారు. కన్నడ, తమిళ, తెలుగు సినిమాలు కూడా చేశారు.

Also ReadGeetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ

'పెహ్లా సితారా, లెజెండ్, 3జీ, బుద్ధా హోగా తేరా బాప్, సైజ్ జీరో, రూలర్, పల్టన్, డిక్టేటర్, ది పవర్, ది ఘోస్ట్, ఆదిపురుష్' వంటి చిత్రాలు చేశారు సోనాల్ చౌహాన్. 'ఆదిపురుష్‌'లో మండోదరి పాత్రలో నటించారు. చివరిగా 'దర్ద్' సినిమాలో కనిపించారు. ఆ సినిమాలో ఆమె ఫాతిమా పాత్రలో కనిపించారు. అది ఆమె మొదటి బంగ్లాదేశ్ - బెంగాలీ సినిమా. సోనాల్ అనేక మ్యూజిక్ వీడియోలు కూడా చేశారు.

Also ReadRenu Desai: నిండుగా బట్టలు వేసుకున్నా రేటు ఎంతని అడిగారు... రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget