Renu Desai: నిండుగా బట్టలు వేసుకున్నా రేటు ఎంతని అడిగారు... రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
Renu Desai Sensational Comments: నటి, సామాజిక కార్యకర్త రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూగజీవాలకు సాయం, ఎన్జీవో గురించి ఇన్‌స్టా లైవ్ ఇచ్చిన ఆవిడ... తనకు ఎదురైన కామెంట్స్ గురించి చెప్పారు.

ఇటీవల ఓ సమావేశంలో మూగ జీవాల కోసం నటి, సామాజిక కార్యకర్త రేణూ దేశాయ్ (Renu Desai) పరుషంగా మాట్లాడారు. ఓ వ్యక్తిపై ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేయగా... ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరొకసారి ఆవిడ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా లైవ్‌లో చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.
కాశీకి వెళ్ళా... నిండైన బట్టల్లో ఉన్నా...
ఒకరు రేటు ఎంత? అని కామెంట్ చేశారు!
విడాకుల సమయం (2012) నుంచి ఇప్పటి వరకు తాను ఎదుర్కొంటున్న మానసిక వేదనను తాజా లైవ్‌లో రేణూ దేశాయ్ పంచుకున్నారు. తన వ్యక్తిగత జీవితంలో భరణం నుంచి మొదలు పెడితే రాజకీయ పరంగా తనపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అసలు ఎటువంటి ఐడెంటిటీ లేని అనానిమస్ అకౌంట్ల నుంచి తనను అసభ్యకరమైన భాషలో తిడుతున్నారని ఆమె తెలిపారు. అటువంటి అకౌంట్లపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీకి వెళ్ళినప్పుడు దిగిన ఫోటోలపై కూడా కొందరు అత్యంత నీచంగా కామెంట్స్ చేశారని ఆమె పేర్కొన్నారు. నిండుగా దుస్తులు వేసుకున్నా రేటు ఎంత అని అడిగారని తెలిపారు.
Also Read: Adivi Sesh: తిరుమల ప్రసాదం టేస్టీగా ఉంది... లడ్డూ వివాదంలో పరోక్షంగా వైసీపీకి అడివి శేష్ కౌంటర్?
View this post on Instagram
నేను మనుషుల కోసం ఎన్జీవో పెట్టలేదు...
మీ ప్రభుత్వాలను ప్రశ్నించండి, నన్ను కాదు!
మూగ జీవాలు (కుక్కల) సంరక్షణ కోసం తాను ఎన్జీవో స్థాపించానని, తాను చేస్తున్న పనులపై కొందరు యూట్యూబర్లు తప్పుగా వక్రీకరించారని రేణూ దేశాయ్ తెలిపారు. వంద కుక్కలలో పది కుక్కలకు పిచ్చి ఉన్నంత మాత్రాన, మిగిలిన 90 కుక్కలను చంపడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. తాను ప్రభుత్వ ప్రతినిధిని కాదని, అయినప్పటికీ కొందరు ప్రజలు తనను బాధ్యురాలిని చేస్తూ తిట్టడం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. మనుషులను పట్టించుకోవడం లేదని కొంత మంది తనను ప్రశ్నిస్తున్నారని, వాళ్ళందరూ వెళ్లి ప్రభుత్వాలను ప్రశ్నించాలని తెలిపారు. తాను మనుషుల కోసం ఎన్జీవో స్థాపించలేదన్నారు.
Also Read: Rashmika Mandanna: దేవరకొండ ఇంట్లో రష్మిక గృహ ప్రవేశం... వైరల్ వీడియో చూశారా?
View this post on Instagram
సోషల్ మీడియాలో బూతులు రాసే నెటిజనుల ప్రవర్తన వాళ్ళ సంస్కారాన్ని, వారి తల్లిదండ్రుల పెంపకాన్ని ప్రశ్నిస్తోందని రేణూ దేశాయ్ అన్నారు. ఈసారి తాను మౌనంగా ఉండనని, పోలీసుల సహాయంతో నీచమైన కామెంట్స్ చేసిన వాళ్ళ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ఈ కామెంట్లను చూపిస్తానని హెచ్చరించారు. తనను తిట్టడం వల్ల ఎవరి ప్రాణం నిలబడదని, నిజంగా ప్రజల ప్రాణాల మీద గౌరవం ఉంటే రోడ్ల పరిస్థితి, ప్రభుత్వ ఆసుపత్రుల కండిషన్ గురించి ఎమ్మెల్యేలను ప్రశ్నించాలని ఆవిడ సూచించారు.























