Geetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
Geetu Royal Tirumala Reel Controversy: తిరుమల దర్శనానికి ముందు కొండపై 'గోవిందా గోవిందా' పాటకు గీతూ రాయల్ రీల్ చేయడం పట్ల విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఆవిడపై యాక్షన్ తీసుకోనున్నారు.

పాపులారిటీ కోసమని పుణ్యక్షేత్రాల్లో కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు చేస్తున్న పనుల పట్ల భక్తులు ఎప్పట్నుంచో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల్లో రీల్స్ చేయడంపై అసంతృప్తి చెందుతున్నారు. తాజాగా 'బిగ్ బాస్ 6' ఫేమ్ గీతూ రాయల్ చేసిన పని మీద సైతం మండి పడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
తిరుమల గుడి ముందు రీల్స్ చేసిన గీతూ రాయల్
Geetu Royal: ఇన్‌స్టాగ్రామ్‌లో గీతూ రాయల్ పాపులర్. ముఖ్యంగా 'బిగ్ బాస్' ఫాలో అయ్యేవాళ్ళకు. మొదట ఆ షో మీద రివ్యూలు చెప్పిన ఆవిడ... 'బిగ్ బాస్' సీజన్ 6లో పార్టిసిపేట్ చేసింది. తర్వాత మరింత పాపులారిటీ పెంచుకుంది. ఈ ఇన్‌స్టా సెలబ్రిటీ ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళింది. ఏడు కొండల వెంకటేశ్వర స్వామి గుడి ముందు 'గోవిందా గోవిందా' పాటకు రీల్స్ చేసింది.
తిరుమల కొండపై, అదీ గుడి ముందు గీతూ రాయల్ రీల్స్ చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో రాజకీయ కార్యక్రమాలు, అన్యమత ప్రచారాలు, రీల్స్ & డ్యాన్స్ చేయడం వంటివి నిషేధం. ఈ నేపథ్యంలో గీతూ రాయల్ వ్యవహార శైలి మీద విమర్శలు వ్యక్తం అయ్యాయి. అది టీడీడీ దృష్టికి వెళ్ళింది.
Also Read: Renu Desai: నిండుగా బట్టలు వేసుకున్నా రేటు ఎంతని అడిగారు... రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
భక్తి పేరుతో భారీ డైలాగ్స్... చివరకు ఏడుపు తక్కువ
విమర్శలు రావడంతో గీతూ రాయల్ వెనక్కి తగ్గింది. రీల్స్ డిలీట్ చేసింది. కానీ అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత భక్తి పేరుతో భారీ భారీ డైలాగ్స్ చెబుతూ మరొక వీడియో చేసింది. అందులో కించిత్ పశ్చాత్తాపం కూడా కనిపించలేదు. పైపెచ్చు తనపై విమర్శలు చేసిన వాళ్లపై ఎదురుదాడి చేసినట్టు ఉంది. టీటీడీ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. గీతూ రాయల్ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఏడ్చినంత పని చేసింది.
Also Read: Adivi Sesh: తిరుమల ప్రసాదం టేస్టీగా ఉంది... లడ్డూ వివాదంలో పరోక్షంగా వైసీపీకి అడివి శేష్ కౌంటర్?
తిరుమల కొండపై, గుడి ముందు రీల్స్ చేయడం చాలా చిన్న విషయం అన్నట్లు గీతూ రాయల్ చెప్పుకొచ్చింది. వెటకారంగా మాట్లాడింది. ''అందరికీ గుడ్ న్యూస్. నా మీద చర్యలు తీసుకుంటారంట. ఇంత విషయాన్ని (చిన్నది అన్నట్టు సైగ చేస్తూ) ఇంత పెద్దది చేసి అన్ని వీడియోలు చేసినందుకు థాంక్యూ సో మచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది. ఇక పోయేదానికి కూడా ఏమీ లేదు. కొద్దో గొప్పో రెండు రవ్వలు మిగిలి ఉంటే దాన్ని మీరు పోగొట్టేయండి. తర్వాత ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా బతికేయండి'' అని గీతూ రాయల్ పేర్కొంది.
Also Read: Rashmika Mandanna: దేవరకొండ ఇంట్లో రష్మిక గృహ ప్రవేశం... వైరల్ వీడియో చూశారా?























