SSC CGLE Answer Key: సీజీఎల్ 2024 'టైర్-2' ప్రాథమిక కీ విడుదల - అభ్యంతరాల నమోదుకు అవకాశం
SSC CGL: సీజీఎల్ 2024 టైర్-2 పరీక్ష ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు కీ చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు.

SSC CGLE 2024 Tier-2 Answer Key: కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్(టైర్-2)-2024 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి 21న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. టైర్-2 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫైనల్ కీ చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రోల్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు జనవరి 24న సాయంత్రం 6 గంటల వరకు ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉండనున్నాయి. నిర్ణీత గడువులోగా సమర్పించిన అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
సీజీఎల్ 2024 టైర్-1 ప్రిలిమినరీ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2024 (CGLE)' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దాదాపు 17,727 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి జూన్ 24 నుంచి జులై 24 వరకు దరఖాస్తులు స్వీకరించారు. గతేడాది సెప్టెంబరు 9 నుంచి 26 మధ్య దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో టైర్-1 పరీక్షలు నిర్వహించారు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్(సీజీఎల్‌ఈ)-2024 టైర్-1 ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గత డిసెంబరు 5న విడుదల చేసిన సంగతి తెలిసిందే.
టైర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు 2025, జనవరి 18, 19, 20 తేదీల్లో టైర్-2 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీలను తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. టైర్-1,టైర్-2 పరీక్షలు, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ మెజర్‌మెంట్స్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఆయా పోస్టులను బట్టి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,42,400 జీతం ఉంటుంది. ఇతర భత్యాలు అదనంగా ఇస్తారు.
టైర్-2 పరీక్ష విధానం:
పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 17,727
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
➥ అసిస్టెంట్
➥ ఇన్‌స్పెక్టర్ - (సీజీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్)
➥ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)
➥ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)
➥ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)
➥ ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ)
➥ ఇన్‌స్పెక్టర్ - ఇన్‌కమ్ ట్యాక్స్
➥ అసిస్టెంట్/అసిస్టెంట్ సూపరింటెండెంట్
➥ ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్)
➥ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (CBIC)
➥ రిసెర్చ్ అసిస్టెంట్ (NHRC)
➥ డివిజనల్ అకౌంటెంట్ (కాగ్)
➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (NIA)
➥ సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎన్‌సీబీ)
➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్)
➥ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ (హాంఅఫైర్స్)
➥ ఆడిటర్ (కాగ్, సీజీడీఏ, etc.,)
➥ అకౌంటెంట్ (కాగ్, సీజీఏ, etc.,)
➥ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
➥ జూనియర్ అకౌంటెంట్ (CGCA)
➥ పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్)
➥ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
➥ అప్పర్ డివిజన్ క్లర్క్
➥ ట్యాక్స్ అసిస్టెంట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

