By: Arun Kumar Veera | Updated at : 21 Jan 2025 02:00 PM (IST)
డిస్కౌంట్లు, రివార్డ్స్ మీ సొంతం! ( Image Source : Other )
Get Huge Rewards On Your Credit Card: మన దేశంలో, కొన్ని కోట్ల మంది జేబుల్లో ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయి. కొంతమంది దగ్గర, ముఖ్యంగా ఉద్యోగుల వద్ద ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్‌ల క్రెడిట్ కార్డ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఒక విలాసంగా కాకుండా అవసరంగా మారింది. ఖర్చులను ఆదా చేసుకోవడానికి & తెలివిగా ఖర్చు చేయడానికి ఇది ఒక గొప్ప మార్గం. క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించిన వ్యక్తి తన జేబు నుంచి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు, రుణదాత అతని తరపున చెల్లిస్తాడు. క్రెడిట్ కార్డ్ యూజర్‌కు, తదుపరి బిల్లు చెల్లింపు తేదీ వరకు రీపేమెంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవసరానికి జేబులో డబ్బు లేకపోయినా క్రెడిట్ కార్డ్ ద్వారా సులభంగా చెల్లించే సౌలభ్యం దీనిని పాపులర్ ఛాయిస్‌గా మార్చింది.
ప్రజలు, ఇప్పుడు, క్రెడిట్ కార్డ్‌లను ఖర్చుల కోసమే కాదు.. ఆర్థిక భద్రత, క్యాష్‌బ్యాక్ & రివార్డ్‌లు పొందడానికి కూడా ఉపయోగిస్తున్నారు. కొన్ని ప్రత్యేక ట్రిక్స్‌తో మీ క్రెడిట్ కార్డ్ ద్వారా లభించే ప్రయోజనాలను పెంచుకోవచ్చు.
క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించే ముందు క్రెడిట్ పరిమితి, వడ్డీ రేటు, క్రెడిట్ వినియోగం మొదలైన వాటిని గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డ్‌ను మరింత ఎక్కువగా ఉపయోగించేలా యూజర్‌ను ప్రోత్సహించడానికి రివార్డ్ పాయింట్లను బ్యాంక్‌లు జారీ చేస్తుంది. ప్రతి లావాదేవీపై రివార్డ్ పాయింట్స్ లేదా క్యాష్‌బ్యాక్ లేదా మైల్స్ వంటివి మీరు పొందుతారు. వీటిని ఉపయోగించి వస్తువులు లేదా గిఫ్ట్ కార్డ్‌లు వంటి కొనుగోలు చేయవచ్చు లేదా ప్రయాణ సమయంలో టిక్కెట్ బుకింగ్స్ కోసం ఉపయోగించుకోవచ్చు.
క్రెడిట్ కార్డ్‌లపై రివార్డ్‌లు పెంచుకోవడానికి కొన్ని చిట్కాలు
* ఎక్కువ కార్డ్‌లు ఉపయోగించండి- మీ క్రెడిట్ కార్డ్ పోర్ట్‌ఫోలియో ఒకటి కంటే ఎక్కువ కార్డ్‌లతో విభిన్నంగా ఉండాలి. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం మీరు వివిధ రకాల కొనుగోళ్లపై ఖర్చు చేయాలి & ఇన్సెంటివ్ స్కీమ్‌లను పూర్తిగా వాడుకోవాలి. మీ దగ్గర ఉన్న కార్డ్‌లతో ప్రతి విభాగంలో ఖర్చు చేయడం వల్ల బ్యాంక్‌లు ఇచ్చే హామీ ప్రయోజనాలు పొందుతారు.
* సంబంధిత చెల్లింపు వ్యవస్థలను ఉపయోగించండి - కొన్ని క్రెడిట్ కార్డ్ ప్రొవైడింగ్ కంపెనీలు కొన్ని పేమెంట్ గేట్‌వేలకు కనెక్ట్ అయి ఉంటాయి. వీటి ద్వారా మీరు పాయింట్లు. రివార్డ్‌లు పొందవచ్చు. మీరు చేయాల్సిందల్లా.. ఫీజులు, అద్దె, రీఛార్జ్ లేదా ఏదైనా ఇతర ఖర్చులను చెల్లించడానికి ఈ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవాలి.
* సకాలంలో బిల్లులు చెల్లించండి - సరైన సమయంలో మీ కార్డ్ నుంచి బిల్లులు చెల్లించడం వల్ల క్యాష్ ఫ్లో పెరుగుతుంది, రివార్డ్‌లు లభిస్తాయి. అంతేకాదు, అనవసర వడ్డీ బాదుడు నుంచి తప్పించుకోవడానికి కూడా మీ క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించాలి.
* రివార్డ్‌లను తెలివిగా ఉపయోగించండి - పాయింట్‌లను గెలుచుకోవడం పెద్ద విషయం కాదు, వాటిని ఎలా ఉపయోగించాలి అనేది కూడా ముఖ్యం. క్యాష్‌బ్యాక్, గిఫ్ట్ కార్డ్‌లు తీసుకోవడం దగ్గర నుంచి నుంచి ట్రావెల్ బుకింగ్స్ & బిల్ క్రెడిట్‌ల వరకు కార్డ్‌లో అందుబాటులో ఉన్న రిడెంప్షన్ ఆప్షన్స్‌ను గుర్తు పెట్టుకోండి.
* ఇ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ - అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, మీషో వంటి ఇ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ కొన్ని బ్యాంక్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఆయా ఫ్లాట్‌ఫామ్స్‌లో షాపింగ్ చేసేటప్పుడు టై-అప్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించడం వల్ల డిస్కౌంట్స్, అడిషనల్ పాయింట్స్ వంటి ప్రయోజనాలు ఉంటాయి.
* గడువు తేదీని ట్రాక్ చేయండి - ప్రతి రివార్డ్‌కు గడువు తేదీ ఉంటుంది. కాబట్టి, గడువు ముగియడానికి ముందే వాటిని ఎలా ఉపయోగించాలో ఆలోచించండి.
మరో ఆసక్తికర కథనం: సామాన్య జనానికి షాక్, చేదెక్కనున్న చక్కెర! - కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయమే కారణం
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి