Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Best Investment Options on Mothers Name | ఆర్థిక ప్రణాళికతో మీ అమ్మకు రెగ్యూలర్ ఆదాయం, లేక కీలకమైన సమయంలో ఆర్థిక భారం లేకుండా ఉండేందుకు వీటిలో ఇన్వెస్ట్ చేయండి.

ప్రస్తుతం బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులను చూసుకోవడానికి టైం కేటాయించడం లేదు. అయితే వృద్ధాప్యం మీ అమ్మ ఆర్థికంగా సురక్షితంగా ఉండాలని మీరు కోరుకుంటే, ఆమె పేరు మీద ఇన్వెస్టిమెంట్ చేయడం తెలివైన పని. సరైన ఆర్థిక ప్రణాళికతో, మీరు మీ అమ్మకు క్రమం తప్పకుండా ఆదాయాన్ని ఏర్పాటు చేయడంతో వృద్ధాప్యంలో ఖర్చుల గురించి ఆందోళనను కూడా తగ్గించుకోవచ్చు. కొత్త సంవత్సరంలో మీ అమ్మ పేరు మీద పెట్టుబడి పెట్టి మంచి రాబడిని పొందగల కొన్ని ప్రభుత్వ, సురక్షితమైన పెట్టుబడి పథకాల గురించి మేం మీకు తెలియజేస్తాము.
ఆరోగ్య బీమాతో వైద్య ఖర్చులు కవర్ అవుతాయి
వయసు పెరిగే కొద్దీ మహిళలకైనా, పురుషులకైనా ఆరోగ్య సమస్యలు సాధారణం అవుతాయి. వైద్య చికిత్సకు ఖర్చులు కూడా పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో మీ అమ్మ పేరు మీద ఆరోగ్య బీమా పాలసీ (Health Insurance) తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఆసుపత్రిలో చేరడం, మందులు, చికిత్స ఖర్చులను సులభంగా కవర్ చేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆకస్మిక ఖర్చుల నుంచి బయట పడొచ్చు.
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి
మీరు నెమ్మదిగా మంచి ఆర్థిక నిధిని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మీ అమ్మ పేరు మీద మ్యూచువల్ ఫండ్లలో SIP ప్రారంభించాలి. ఇందులో ప్రతి నెలా మీ బడ్జెట్ ప్రకారం పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలంలో ఈ చిన్న పెట్టుబడి మీకు మంచి రాబడిని అందిస్తుంది. ఇది భవిష్యత్ అవసరాలను సులభతరం చేస్తుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి
60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ నమ్మకమైన ఎంపికగా చెప్పవచ్చు. ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న స్కీమ్. ఇందులో స్థిరమైన వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో డబ్బును బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ (Post office) ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఇది క్రమం తప్పకుండా ఆదాయానికి మార్గం అవుతుంది.
సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి
మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఫిజికల్ గోల్డ్ కంటే సావరిన్ గోల్డ్ బాండ్లు కూడా మంచి నిర్ణయం. ఇందులో బంగారం ధర పెరిగితే ప్రయోజనం లభిస్తుంది. సురక్షితమైన పెట్టుబడి భరోసా కూడా ఉంటుంది.
మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన
మహిళల కోసం నడుస్తున్న ఒక ప్రత్యేక ప్రభుత్వ పథకం మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన. ఇందులో స్థిర వడ్డీ రేటుతో పాటు కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. పరిమిత పెట్టుబడితో కూడా ఈ పథకంలో మంచి రాబడిని పొందవచ్చు, దీనితో భవిష్యత్తు కోసం నిధిని సిద్ధం చేయవచ్చు.
ఫిక్స్‌డ్ డిపాజిట్లలో అదనపు వడ్డీ
మీ అమ్మ పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే, సీనియర్ సిటిజన్లకు సాధారణ FD లతో పోలిస్తే ఎక్కువ వడ్డీ ప్రయోజనం కలుగుతుంది. ఈ పెట్టుబడి తక్కువ రిస్క్ తో కూడుకున్నది. అవసరమైన సమయంలో సులభంగా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ అమ్మ పేరిట పలు రకాలుగా ఇన్వెస్ట్ చేసి వారికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు అత్యవసర సమయంలో మీపై ఖర్చుల భారం కూడా తగ్గుతుంది.
Note: మీరు చేసే పెట్టుబడులు రిస్క్ తో కూడుకుని ఉంటాయి. ఏదైనా పథకంలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుడ్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ అందించిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏబీపీ దేశం పెట్టుబడికి సంబంధించి ఎవరికీ సూచించదు.






















