Purandeswari About Balakrishna: డాకు మహారాజ్ సినిమా చూసిన ఎంపీ పురందేశ్వరి, సోదరుడు బాలకృష్ణ నటనపై ప్రశంసలు
బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తన సోదరుడు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా వీక్షించారు. అనంతరం సోదరుడు బాలకృష్ణ నటనపై ప్రశంసలు కురిపించారు.
Balakrishna Daku Maharaj Movie | చీరాల: గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సినిమాకు అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. బాక్షాఫీసు వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది. సంక్రాంతి బరిలో నిలిచి మరో హిట్ అందుకున్న బాలకృష్ణ సినిమాను ఆయన కుటుంబసభ్యులు వీక్షించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తన సోదరుడు బాలకృష్ణ సినిమాను తన కుటుంబంతో కలిసి చూశారు.
మా బాలయ్య నటసింహం
బాపట్ల జిల్లా చీరాలలోని మోహన్ థియేటర్ లో సంక్రాంతి సందర్బంగా డాకు మహారాజ్ సినిమా చూశారు. తన సోదరుడు బాలకృష్ణ నటనపై ప్రశంసల జల్లులు కురిపించారు. డాకు మహారాజ్ సినిమా చూసిన తరువాత పురందేశ్వరి మాట్లాడుతూ.. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాజిక, సందేశాత్మక అంశాలతో మంచి సినిమా తీశారు. బాలకృష్ణ నటన అద్భుతంగా ఉంది. సేవ చేసిన వారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు అనేది ఈ సినిమాలో చూపించారు. నిరంతం సేవ చేసే వ్యక్తి ప్రజల మనసులో చిరకాల గుర్తుండిపోతారు. బాలకృష్ణ నటసింహం అని డాకు మహారాజ్ ద్వారా మరోసారి నిరూపితమైంది. బాలకృష్ణకు అభినందనలు. చిత్ర బృందానికి అభినందనలు. మంచి సినిమా తీసిన దర్శకుడు బాబీ, సినిమా నిర్మాతలకు కంగ్రాట్స్’ చెప్పారు.