అన్వేషించండి

Maha Kumbh 2025: అస్వస్థతకు గురవుతున్న కుంభమేళాలో పాల్గొన్న భక్తులు - కారణాలు ఏంటంటే

Prayagraj | మహా కుంభమేళాకు తరలివచ్చి తొలిరోజు పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం, చన్నీటి స్నానం కారణమని చెబుతున్నారు.

Maha Kumbh Mela 2025 in Prayagraj | ప్రయాగ్‌రాజ్: మహాకుంభమేళాలో పాల్గొన్న భక్తులు పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురవుతున్నారు. మహా కుంభమేళ ప్రారంభమైన తొలిరోజైన జనవరి 13న ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే పవిత్ర నదీ స్నానం చేసిన వారిలో పలువురు అస్వస్థకు గురై ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. సోమవారం కుంభమేళలో పాల్గొని స్నానమాచరించిన వారిలో 132 మంది అస్వస్థతకు గురికాగా, మెడికల్ టీమ్ వారి ప్రథమ చికిత్స చేసింది. చాలా మందిలో దగ్గు, జలుబు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని అధికారులు చెబుతున్నారు.  

ప్రతికూల వాతావరణం, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం, చలి గాలులు, చన్నీటి స్నానం లాంటి కారణాలతో చిన్నారులతో పాటు వృద్ధులు అస్వస్థతకు గురవుతున్నారని అధికారులు తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు తొలిరోజు మహా కుంభమేళాకు తరలిరావడంతో వారి అరుపులు, కేకలతో సైతం కొందరు గుండె సంబంధిత సమస్యల బారిన పడ్డారు. అయితే సెంట్రల్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ప్రతికూల వాతావరణం కారణంగా చాలా మంది భక్తులు ఔట్ పేషెంట్ విభాగాన్ని (OPD)లో చికిత్స తీసుకున్నారు. గుండె సంబంధిత సమస్యలతో జునా అఖాడాకు చెందిన మహామండలేశ్వర్ అస్వస్థతకు లోనయ్యారు. అనుచరులు వెంటనే అప్రమత్తమై ఆయనకు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు.  

భక్తులపై గులాబీల వర్షం
ప్రతికూల వాతావరణం ఉన్నా భక్తులు పెద్ద సంఖ్యలో మహా కుంభమేళాకు ప్రయాగ్ రాజ్ బాట పట్టారు. మకర సంక్రాంతి నాడు త్రివేణి సంగమంలో 'అమృత స్నానం' చేసేందుకు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో నేటి ఉదయం భక్తులపై హెలికాప్టర్ నుంచి గులాబీ పూల వర్షం కురిపించారు. "జై శ్రీ రామ్", "హర్ హర్ మహాదేవ్", ఓం నమ శివాయ నినాదాలు ప్రయాగ్ రాజ్‌ ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రతిధ్వనిస్తున్నాయి. 

Also Read: Mahakumbha mela: మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా గ్లామరస్ సాధ్వీలు కూడా - హాట్ టాపిక్ గా హర్ష రిచారియా !

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు పర్యావరణ శాఖ గత కొన్నిరోజుల నుంచి ఇందుకోసం ప్లాన్ చేసింది. నేడు సంక్రాంతి పర్వదినాన పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులపై పూల వర్షం కురిపించాలని ఏర్పాట్లు చేసి, భక్తులపై పూల వర్షం కురిపించారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కుంభమేళాకు వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలని, ప్రయాణంలో సమస్యలు లేకుండా చూసుకోవాలని అధికారులు సూచించారు.


45 రోజులపాటు ఆధ్యాత్మిక కుంభమేళా
12 సంవత్సరాల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళా భోగి పండుగ నాడు ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరం కొనసాగుతుంది. అధికారిక అంచనా ప్రకారం చూస్తే తొలిరోజు దాదాపు 1.75 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించార. సంక్రాంతి నాడు మంగళవారం మధ్యాహ్నం నాటికి మరో 1.38 కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పాల్గొన్నారని అధికారిక సమాచారం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sankranti 2025 Telugu Movies: సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
Nara Lokesh Gift: భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
China Manja For Kites: పీకలు తెగుతున్నా హైదరాబాద్‌లో ఆగని చైనా మాంజా అమ్మకాలు- ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
పీకలు తెగుతున్నా హైదరాబాద్‌లో ఆగని చైనా మాంజా అమ్మకాలు- ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
Hari Hara Veera Mallu: వినాలి... వీరమల్లు మాట వినాలి - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి సర్‌ప్రైజ్, ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
వినాలి... వీరమల్లు మాట వినాలి - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి సర్‌ప్రైజ్, ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maha Kumbh Mela 2025 Day 1 Highlights | ప్రయాగలో కళ్లు చెదిరిపోయే విజువల్స్ | ABP DesamMahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti 2025 Telugu Movies: సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
Nara Lokesh Gift: భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
China Manja For Kites: పీకలు తెగుతున్నా హైదరాబాద్‌లో ఆగని చైనా మాంజా అమ్మకాలు- ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
పీకలు తెగుతున్నా హైదరాబాద్‌లో ఆగని చైనా మాంజా అమ్మకాలు- ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
Hari Hara Veera Mallu: వినాలి... వీరమల్లు మాట వినాలి - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి సర్‌ప్రైజ్, ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
వినాలి... వీరమల్లు మాట వినాలి - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి సర్‌ప్రైజ్, ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
Jallikattu: చిత్తూరు జిల్లాలో జల్లికట్టు జోష్, ఎద్దులు రంకెలేసి దూసుకొస్తున్నా తగ్గేదేలే అంటున్న యువత
చిత్తూరు జిల్లాలో జల్లికట్టు జోష్, ఎద్దులు రంకెలేసి దూసుకొస్తున్నా తగ్గేదేలే అంటున్న యువత
Hyderabad Double Murder: సంక్రాంతి రోజు నార్సింగిలో జంట హత్యల కలకలం- యువతి, యువకుడిపై అంత పగ ఎవరికో?
సంక్రాంతి రోజు నార్సింగిలో జంట హత్యల కలకలం- యువతి, యువకుడిపై అంత పగ ఎవరికో?
Sankranti 2025: తెలంగాణకు పాకిన గోదావరి
తెలంగాణకు పాకిన గోదావరి "అతి" మర్యాదలు, శృతి మించుతున్న సంక్రాంతి అల్లుడి వెరైటీ విందులు
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు
Embed widget