Horoscope 18th January 2025: ఈ రాశులవారి వైవాహిక జీవితం ఒత్తిడితో కూడుకుని ఉంటుంది
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జనవరి 18 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు ఆఫీసు బాధ్యతల వల్ల వ్యక్తిగత పనులకు సమయం ఇవ్వలేరు. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. మీరు సృజనాత్మక పనిపై ఆసక్తి చూపుతారు. వృద్ధులకు సేవ చేయడంపై ఆసక్తి కలిగి ఉంటారు.
వృషభ రాశి
ఈ రోజు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొద్దిపాటి శ్రమతోనే అనుకున్న పనులు పూర్తవుతాయి...కానీ వచ్చిన విజయంతో సంతోషించలేరు. వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. రహస్య విషయాలను అధ్యయనం చేయడంలో మీకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది.
మిథున రాశి
ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు. వైవాహిక జీవితం కొద్దిగా ఒత్తిడితో కూడుకున్నది అవుతుంది. ముఖ్యమైన పనులన్నీ మధ్యాహ్నం లోగా పూర్తిచేసేయడం మంచిది. వ్యాపారంలో మంచి అవకాశాలు లభిస్తాయి. స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి. స్నేహితులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు
Also Read: కుంభమేళాలో స్నానఘాట్ కి వెళ్లొచ్చేందుకు ఎంత సమయం పడుతోందో తెలుసా.. మొదటి 4 రోజుల్లో ఎన్ని విశేషాలో!
కర్కాటక రాశి
ఈ రోజు వైవాహిక జీవితం బాగుంటుంది. మీ మాటలకు, ఆలోచనలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి రోజు కొంత బలహీనంగా ఉంటుంది. రోజు ప్రారంభంలో కొన్ని కారణాల వల్ల మీరు ఆందోళన చెందుతారు.
సింహ రాశి
ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు. పిల్లలు మీ మాటలను అనుసరిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఈ రోజు మీరు మీ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు.
కన్యా రాశి
ఈ రోజు వైవాహిక జీవితంలో కొంత లోటు ఉండవచ్చు, కానీ సాయంత్రం నాటికి మీరు దానిని ప్రేమతో పరిష్కరించుకుంటారు. కెరీర్‌కు సంబంధించి కొత్త ఆలోచనలు మీ మనసులో మెదులుతాయి. సామాజిక జీవితంలో చురుకుగా ఉంటారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆహార నాణ్యత విషయంలో జాగ్రత్త వహించండి.
Also Read: సూర్యుడి రాశి పరివర్తనం ఫిబ్రవరి 12 వరకు ఈ 4 రాశులవారి జీవితంలో అన్నీ అద్భుతాలే!
తులా రాశి
ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు తమకు నచ్చిన విద్యాసంస్థల్లో ప్రవేశం పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులుంటాయి. సాయంత్రం అయ్యేసరికి కొన్ని సంఘటనల గురించి ఆలోచిస్తారు. ప్రేమ సంబంధాల విషయంలో కొన్ని ఇబ్బందులుంటాయి
వృశ్చిక రాశి
ఈ రోజు సబార్డినేట్ ఉద్యోగులు మీకు సహాయం చేస్తారు. మీరు ఏ పని అనుకున్నా, ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఈ రోజు మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. ఇది భవిష్యత్తులో కూడా లాభదాయకంగా ఉంటుంది
తులా రాశి
ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు తమకు నచ్చిన విద్యాసంస్థల్లో ప్రవేశం పొందవచ్చు. ఉన్నతాధికారుల మీ బాస్ చెప్పిన కొన్ని విషయాలు చెడ్డవిగా అనిపించవచ్చు. సాయంత్రం మీరు కొన్ని సంఘటనల గురించి ఆలోచించవచ్చు. ప్రేమ సంబంధాల విషయంలో చాలా సీరియస్‌గా ఉంటారు.
Also Read: కరవు, యుద్ధం, పకృతి వైపరీత్యాలు, అంటు వ్యాధులు..2025లో జరగబోయే ఈ సంఘటనలు ప్రపంచాన్ని వణికిస్తాయ్!
మకర రాశి
ఈ రోజు ఉద్యోగస్తులకు కొంత ఉదాసీనత ఉంటుంది. కోపానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఒత్తిడిని అధిగమించేందుకు స్నేహితుల సహకారం తీసుకోండి. ఆధ్యాత్మిక గ్రంధాలను అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు.
కుంభ రాశి
ఈ రోజు ప్రతికూల ఆలోచనల ప్రభావంతో మీలో చాలా మార్పులు రావొచ్చు. ఇతరుల పనిలో తప్పులు కనుగొనవద్దు. కమీషన్ సంబంధిత పనుల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది. వ్యాపారంలో కొన్ని చిన్న పొరపాట్లు చేసి ఆర్థికంగా నష్టపోతారు
మీన రాశి
ఈ రాశివారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులు , వ్యాపారులకు శుభసమయం. అధికారులు మీ ఆలోచనలకు మద్దతిస్తారు. సానుకూల ఆలోచనలు చేయండి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.



















