అన్వేషించండి

Ugadi Panchangam 2026: మకర రాశివారికి ఈ ఏడాది శని బలం, అదృష్టం మీ సొంతం! సెప్టెంబర్ తర్వాత అన్నీ అద్భుతాలే! ఉగాది పంచాంగం 2026- 2027

Ugadi Panchangam 2026 Capricorn Horoscope: శ్రీ పరాభవ నామసంవత్సరంలో మకర రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయి? ఏ గ్రహం అనుకూలం? ఏ గ్రహం ప్రతికూలం? 2026 - 2027 వార్షిక ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Makara Rashi  Parabhava Nama Samvatsaram Phalitalu 2026 2027

ఉగాది పంచాంగం 2026-2027 :  మకర రాశి

ఉత్తరాషాఢ 2,3,4, పాదాలు , శ్రవణం , ధనిష్ఠ 1,2 పాదాలు
ఆదాయం 2 వ్యయం 8 రాజపూజ్యం 1 అవమానం6

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశివారికి గతేడాది కన్నా శని బలంగా ఉండడంతో మంచి ఫలితాలుంటాయి. కుటుంబ కారకుడు అయిన గురుడు 7వ ఇంట రాహువుతో కలిసిఉన్నప్పటికీ లగ్నాధిపతి శని బలంగా ఉండడం వల్ల శుభమే జరుగుతుంది. చేపట్టిన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు, ఆదాయం బావుంటుంది. ఎలాంటి ఒడిదొడకులు ఉండవు, మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగువేస్తారు. పణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఈ ఏడాది మీరు ఎంత దైవారాధన చేస్తే అంత మంచి ఫలితాలు పొందుతారు. అన్నిరంగాలవారికి యోగం కాలం, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అయితే ఇంట్లో మార్పులు, దొంగభయం, ప్రయాణంలో నష్టాలు, సోదరుల మూలక ఇబ్బందులు తప్పవు

పరాభవ నామ సంవత్సరం మకర రాశి ఉద్యోగులకు

2026-2027 మకర రాశి ఉద్యోగులకు బావుంటుంది. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఏడాది ఆరంభంలో స్థానమార్పులు ఉంటాయి కానీ సెప్టెంబర్ నుంచి అనుకూల ఫలితాలుంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఉద్యోగం మారే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు సెప్టెంబర్ తర్వాత ఉద్యోగం లభిస్తుంది. 

పరాభవ నామ సంవత్సరం మకర రాశి విద్యార్థులకు

ఈ రాశి విద్యార్థులకు ఆగష్టు వరకూ గురుబలం లేదు..అప్పటివరకూ చదువుపై శ్రద్ధ పెరగదు, జ్ఞాపకశక్తి సరిగా ఉండదు, ఈ లోగో పరీక్షలు బాగా రాయలేరు, ప్రధమార్థంలోనే ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతాయి కాబట్టి మంచి ర్యాంకులు సాధించడం కష్టమే. సెప్టెంబర్ నుంచి పరిస్థితిలో మార్పు వస్తుంది. అప్పటి నుంచి అనుకున్న దిశగా అడుగులుపడతాయి
 
పరాభవ నామ సంవత్సరం మకర రాశి క్రీడాకారులకు అనుకూల ఫలితాలున్నాయి

పరాభవ నామ సంవత్సరం మకర రాశి వ్యాపారులకు

ఈ ఏడాది మకర రాశి వ్యాపారులకు శనిబలంతో లాభాలోస్తాయి.  రియల్ ఎస్టేట్, సరుకులు నిల్వచేసేవారికి, కాంట్రాక్టుపనులు చేసేవారికి రెట్టింపు లాభాలుంటాయి. బంగారం, వెండివ్యాపారాలకు ఆగష్టువరకు బాగుండదు. 

పరాభవ నామ సంవత్సరం మకర రాశి వ్యవసాయదారులకు

ఈ సంవత్సరం మకర రాశి వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా రెండవ పంట బాగా పండుతుంది. సెప్టెంబర్ నుంచి అనుకూలవాతావరణం, అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. కౌలుదార్లకు మంచి ఫలితాలుంటాయి. చేపలు, రొయ్యలు చెరువుల వారికి సెప్టెంబర్ తర్వాత లాభాలొస్తాయి
 
పరాభవ నామ సంవత్సరం మకర రాశి రాజకీయ నాయకులకు
 
ఈ రాశి రాజకీయనాయకులకు శనిబలం వల్ల తిరుగుండదు. ప్రతి విషయంలోనూ మీ మాటే పైచేయిగా ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. సాంఘికంగా సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏదో ఒక పదవి లభిస్తుంది. ఎన్నికల్లో పోటీచేస్తే విజయం సాధిస్తారు. కావాలని ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని బాధపెట్టాలి అనుకున్నా ఫెయిలవుతారు

పరాభవ నామ సంవత్సరం మకర రాశి కళాకారులకు

ఈ ఏడాది టీవీ, సినిమా రంగానికి చెందిన మకర రాశ కళాకారులకు యోగదాయకం అయిన కాలం. గతంలో వెంటాడిన సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మంచి అవకాశాలు, విజయాలు, అవార్డులు, ఆదాయం మీ సొంతం

మకర రాశి స్త్రీలకు

ఈ రాశి స్త్రీలకు శనిబలం వల్ల ఎదురుండదు. కుటుంబంలో మీపై గౌరవం పెరుగుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. ఆగష్టు వరకు స్వల్పంగా కుటుంబ సమస్యలున్నా ఆ తర్వాత నుంచి పరిస్థితిలో మార్పుంటుంది. విలువైన వస్తువులు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తలమధ్య ఏమైనా వివాదాలుంటే సమసిపోతాయి. అన్ని రంగాల్లో ఉండేవారికి సెప్టెంబర్ నుంచి పరిస్థితిలో మార్పు వస్తుంది.

మొత్తంమీద శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి గతేడాది కన్నా మంచి ఫలితాలున్నాయి.. ఆగష్టు వరకూ పరిస్థితులు అటు ఇటుగా ఉన్నా సెప్టెంబర్ నుంచి బావుంటుంది. ఉన్నతంగా జీవిస్తారు..మిమ్మల్ని చూసి అంతా ఈర్ష్య పడేలా ఉంటారు

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

ఉగాది 2026 పరాభవ నామసంవత్సరంలో మీ రాశి ఆదాయం - వ్యయం తెలుసుకోండి!

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Simhachalam Chandanotsavam 2026 : సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం! నిజరూప దర్శన సమయం, టికెట్ల వివరాలు ఇవిగో!
సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం! నిజరూప దర్శన సమయం, టికెట్ల వివరాలు ఇవిగో!
Venus Transit 2026: వృషభ రాశిలో శుక్రసంచారం! ప్రేమ, డబ్బు, వృత్తిపై మీ రాశి ప్రకారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
వృషభ రాశిలో శుక్రసంచారం! ప్రేమ, డబ్బు, వృత్తిపై మీ రాశి ప్రకారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజు చెప్పులు లేదా బూట్లు కొనొచ్చా?
అక్షయ తృతీయ రోజు చెప్పులు లేదా బూట్లు కొనొచ్చా?
Akshaya Tritiya 2026: న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో జన్మించినవారికి అక్షయ తృతీయ చాలా శుభప్రదమైనది, ధనం వెల్లువెత్తుతుంది!
న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో జన్మించినవారికి అక్షయ తృతీయ చాలా శుభప్రదమైనది, ధనం వెల్లువెత్తుతుంది!
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Meta Layoffs 2026: మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
Prakash Raj: రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్
రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్
IPL 2026: CSK బ్యాటర్ ఔటవ్వాలని SRH ఫ్యాన్ చేతబడి.. రిజల్ట్ చూస్తే షాక్
CSK బ్యాటర్ ఔటవ్వాలని SRH ఫ్యాన్ చేతబడి.. రిజల్ట్ చూస్తే షాక్ Viral Video
US Iran War Updates: హర్మూజ్‌పై మరోసారి ఉద్రిక్తత- ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో లేదన్న డొనాల్డ్ ట్రంప్
హర్మూజ్‌పై మరోసారి ఉద్రిక్తత- ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో లేదన్న డొనాల్డ్ ట్రంప్
Shruti Haasan: ఎవర్రా మమ్మీ... శృతి హాసన్‌కు కోపం వచ్చింది
ఎవర్రా మమ్మీ... శృతి హాసన్‌కు కోపం వచ్చింది
Love Failure: అమ్మను బాగా చూసుకోండి బాబాయ్.. ప్రేమ విఫలమై తిరుపతిలో విద్యార్థి ఆత్మహత్య
అమ్మను బాగా చూసుకోండి బాబాయ్.. ప్రేమ విఫలమై తిరుపతిలో విద్యార్థి ఆత్మహత్య
6 ఎయిర్ బ్యాగ్స్, 30 కి.మీ మైలేజ్‌.. Maruti Suzuki Baleno Facelift అతి తక్కువ ధరకే.. త్వరలో మార్కెట్లోకి
6 ఎయిర్ బ్యాగ్స్, 30 కి.మీ మైలేజ్‌.. Maruti Baleno Facelift అతి తక్కువ ధరకే.. త్వరలో మార్కెట్లోకి
Koratala Siva: దేవర 2 కాదు... ఎన్టీఆర్ సినిమాకు ముందు కొరటాల నుంచి మరో సీక్వెల్
దేవర 2 కాదు... ఎన్టీఆర్ సినిమాకు ముందు కొరటాల నుంచి మరో సీక్వెల్
Embed widget