అన్వేషించండి

Anakalapalle Latest News: "మా ఫుడ్‌తో పిండివంటలు చేసుకుంటున్నార్‌ సార్" బీసీ హాస్టల్‌ దుస్థితిపై లోకేష్‌కు విద్యార్థుల ఫిర్యాదు! ప్రభుత్వం సీరియస్

Anakalapalle Latest News: చీడికాడ బీసీ హాస్టల్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని అక్కడ విద్యార్థులు ఓ వీడియోల ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోను నేరుగా మంత్రి నారా లోకేష్‌కు ట్యాగ్ చేశారు.

Anakapalli Chidikada BC Hostel Issue: అనకాపల్లి జిల్లా చీడికాడమండల కేంద్రంలోని బీసీ బాలికల హాస్టల్‌ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్కడ చదువుకుంటున్న పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. అడిగితే వేధింపులు, ప్రశ్నిస్తే దండనలు. చివరకు తమ గోడును విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు విన్నవించుకున్నారు. దీంతో విషయంపై మంత్రి వెంటనే స్పందించారు. ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 

చీడికాడ బీసీ హాస్టల్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని అక్కడ విద్యార్థులు ఓ వీడియోల ఆవేదన వ్యక్తం చేశారు. "మాకు సరిపడా ఆహారం పెట్టడం లేదని వారు మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. సార్ మాకు అన్నం సరిపోవట్లేదు. ఇది అడిగితే మమ్మల్ని తిడుతున్నారు. మీరు స్కూల్‌లో మధ్యాహ్నం భోజనం తింటున్నారు కదా మళ్లీ ఇక్కడ ఎందుకు అని అడుగుతున్నారు. " అంటూ విద్యార్థినులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఒక వేళ ఎవరైనా ధైర్యం చేసి ఆకలి వేస్తోందని అని అడిగితే మరుసటి రోజు కావాలనే ఎక్కువ వండి, అడిగిన విద్యార్థినిని టార్గెట్ చేసి ఆ మిగిలిపోయిన ఆహారాన్నంతా బలవంతంగా తినిపిస్తున్నారని వారు కన్నీరు పెట్టుకున్నారు. 

హాస్టల్ సరకులు అధికారుల ఇళ్లకు

ప్రభుత్వం పిల్ల కోసం పంపించే పౌష్టికాహారం పిల్లలకు చేరడం లేదు. రాత్రి పది గంటలు దాటిన తర్వాత హాస్టల్‌ నుంచి బియ్యం బస్తాలు, ఇతర వస్తువులు బయటకు వెళ్లిపోతున్నాయని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. మాకు పెట్టాల్సిన చికెన్, బియ్యం, ఇత వస్తువులు సిబ్బంది వాళ్ల ఇళ్లకు తీసుకెళ్లిపోతున్నారు. మా కోసం బియ్యంతో వాళ్లు పిండి వంటలు చేసుకుంటున్నారు. మాకు పెట్టాల్సిన పాలు కూడా నీళ్లలా ఉంటున్నాయి. ఎన్ని ప్యాకెట్లు వచ్చినా అందుకో నీళ్లు కలిపి మాకు ఇస్తున్నారు. అని పిల్లలు చెప్పారు.  ప్రభుత్వ నిధులను సరకులను హాస్టల్ సిబ్బంది పంచుకుంటున్నారని తెలిపారు. 

వేధింపులు అక్రమ వసూళ్లు

హాస్టల్‌లో సమస్యలు కేవలం ఆహారంతోనే ఆగిపోలేదు. పిల్లల పట్ల సిబ్బంది చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చాలా అసభ్యంగా తిడుతున్నారని చెప్పారు. ఆడపిల్లలకు అందించాల్సిన కనీస గౌరవం కూడా అక్కడ దక్కడం లేదు. మెచ్యూర్ అయిన వాళ్ల నుంచి శారీలు, స్వీట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని విద్యార్థినులు వాపోతున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి మూడు నుంచి నాలుగు వందల రూపాయలు వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని డబ్బులు ఇవ్వలేమని చెబితే తీవ్రంగా తిడుతున్నారని వారు ఆవేదన చెందారు. 

మంత్రి లోకేష్ స్పందన - రంగంలోకి దిగిన ప్రభుత్వం  

ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా విద్యాశాఖ మంత్రిలోకేష్‌ దృష్టికి విద్యార్థినులు తీసుకెళ్లారు. చీడికాడి హాస్టల్‌లో జరుగుతున్న దారుణాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. "చీడికాడ బీసీ హాస్టల్‌లో ఆహార కొరత ఉందన్న విషయం తెలిసి చాలా బాధపడ్డాను, నా చెల్లెళ్లకు నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చూస్తాను. ఈ విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్తున్నాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతున్నాను." అంటూ లోకేష్ ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు. 

మంత్రి ఆదేశాలతో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కూడా స్పందించారు. ఆయన అధికారులతో కలిసి చీడికాడ హాస్టల్‌, పాఠశాలను సందర్శించారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా నాణ్యమైన భోజనం ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచనలు చేశారు. 

మార్పు మొదలవ్వాలి

చీడికాడ ఘటన ఒక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హాస్టళ్లలో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చీడికాడ విద్యార్థినులు చూపిన ధైర్యం అభినందనీయం. తమకు జరిగిన అన్యాయం గురించి నేరుగా చెప్పడం వల్ల అధికారులు పరుగులు పెట్టారు. మిగతా ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులు గళమెత్తాలి, సమస్యలు తెలియజేయాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Crime News:సోషల్ మీడియా స్నేహమే ప్రాణం తీసింది! విశాఖ విద్యార్థి శాంతి కుమారి మృతి కేసులో మలుపు!  
సోషల్ మీడియా స్నేహమే ప్రాణం తీసింది! విశాఖ విద్యార్థి శాంతి కుమారి మృతి కేసులో మలుపు!  
Narasapuram -Tirupati Train: నరసాపురం -తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ వచ్చేసింది! టైమింగ్స్ ఇవే!
నరసాపురం -తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ వచ్చేసింది! టైమింగ్స్ ఇవే!
Nara Lokesh: వెక్కిరింపుల మెట్లెక్కి వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా! చంద్రబాబు కొడుకైనా నారా లోకేష్‌కు ఈజీగా అందని పదవులు!
వెక్కిరింపుల మెట్లెక్కి వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా! చంద్రబాబు కొడుకైనా నారా లోకేష్‌కు ఈజీగా అందని పదవులు!
AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు బుధవారం విడుదల! నేరుగా వాట్సాప్‌లో రిజల్ట్స్‌!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు బుధవారం విడుదల! నేరుగా వాట్సాప్‌లో రిజల్ట్స్‌!
Advertisement

వీడియోలు

IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజ‌యంతో స‌త్తా చాటిన బెంగుళూరు
Rasik Dar Salam vs LSG IPL 2026 | ఆర్‌సీబీ కొత్త సెన్సేషన్ రసిక్ సలామ్
Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్
Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hormuz Strait Open: హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్ - ఇక చమురు కష్టాలు తప్పినట్లే!
హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్ - ఇక చమురు కష్టాలు తప్పినట్లే!
HUMBL బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన BRS..
HUMBL బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన BRS..
Prakash Raj : సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
ISRO High Alert: అంతరిక్షంలో భారీగా ట్రాఫిక్ జామ్‌! భారతీయ ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పు! ఇస్రో హైఅలర్ట్!
అంతరిక్షంలో భారీగా ట్రాఫిక్ జామ్‌! భారతీయ ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పు! ఇస్రో హైఅలర్ట్!
Pakistan: పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
Vishu poster controversy: కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
Child born the day after marriage: పెళ్లయిన తర్వాత రోజే తల్లయిన పెళ్లి కూతురు - నిజంగానే - ఆ కొత్త పెళ్లి కొడుకు పరిస్థితేమిటి?
పెళ్లయిన తర్వాత రోజే తల్లయిన పెళ్లి కూతురు - నిజంగానే - ఆ కొత్త పెళ్లి కొడుకు పరిస్థితేమిటి?
Prakash Raj Ram controversy: రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
Embed widget