TTD April 2025 Tickets: తిరుమల భక్తులకు అలర్ట్..ఏప్రిల్ 2025 దర్శన టికెట్లు విడుదలయ్యాయ్!
TTD Tickets: ఈ ఏడాది ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్ లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదలచేసింది..

TTD Alert: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకోసం ముఖ్య గమనిక... 2025 ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన ఏప్రిల్ కోటాను జనవరి 18 నుంచి ఆన్ లైన్లో అందుబాటులో ఉంచింది. జనవరి 18 ఉదయం నుంచి 20 వ తేదీ వరకూ రెండు రోజుల పాటూ ఆన్ లైన్లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్నవారంతా జనవరి 20 నుంచి 22 మధ్యాహ్నం లోగా డబ్బులు చెల్లించాలి. లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం.
- 21 వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేస్తారు
- 21 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు అందుబాటులోకి వస్తాయ్
- 23వ తేది ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణం టిక్కెట్లు విడుదలవుతాయి
- 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు అందుబాటులో ఉంచుతారు
- 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు - వికలాంగుల దర్శన టికెట్లు విడుదలచేస్తారు
- 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలవుతాయ్
- 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల చేస్తారు
- 27వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి సేవా కోటా విడుదల టిక్కెట్లు విడుదలవుతాయి
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ నుంచి ఆర్జితసేవలు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచించారు
Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!
మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. జనవరి 19 ఆదివారంతో వైకుంఠ ద్వారా దర్శనాల ముగియనున్నాయి. టోకెన్ ఉన్న భక్తులను మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిస్తున్నారు.
- శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది
- తిరుమలలో జనవరి 17 శుక్రవారం శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 61 వేల 142 మంది
- టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పడుతోంది
- 300 రూపాయల టికెట్ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది
- శుక్రవారం స్వామికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 19 వేల 736 మంది
- శుక్రవారం స్వామివారి హుండీ ఆదాయం 3 కోట్ల 51 లక్షలు
Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?
శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రం (Sri Venkateshwara Panchaka Stotram)
శ్రీధరాధినాయకం శ్రితాపవర్గదాయకం
శ్రీగిరీశమిత్రమంబుజేక్షణం విచక్షణమ్ |
శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 1
ఉపేంద్రమిందుశేఖరారవిందజామరేంద్రబృ-
-న్దారకాదిసేవ్యమానపాదపంకజద్వయమ్ |
చంద్రసూర్యలోచనం మహేంద్రనీలసన్నిభమ్
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 2
నందగోపనందనం సనందనాదివందితం
కుందకుట్మలాగ్రదంతమిందిరామనోహరమ్ |
నందకారవిందశంఖచక్రశార్ఙ్గసాధనం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 3
నాగరాజపాలనం భోగినాథశాయినం
నాగవైరిగామినం నగారిశత్రుసూదనమ్ |
నాగభూషణార్చితం సుదర్శనాద్యుదాయుధం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 4
తారహీరశారదాభ్రతారకేశకీర్తి సం-
-విహారహారమాదిమధ్యాంతశూన్యమవ్యయమ్ |
తారకాసురాటవీకుఠారమద్వితీయకం
నాగరాడ్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 5
ఇతి శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రమ్ |
ఓం నమో వెంకటేశాయ
ఓం నమో నారాయణాయ నమః
Also Read: లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా దక్కాలంటే..తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇలా చేయండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

