Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Pawan Kalyan Creative Works : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హోం ప్రొడక్షన్స్ క్రియేటివ్ వర్స్క్ నుంచి న్యూ పోస్టర్ వైరల్ అవుతోంది. మార్షల్ ఆర్ట్స్ జర్నీకి సంబంధించి అనౌన్స్‌మెంట్ రాబోతోంది.

Pawan Kalyan's New Phase Martial Arts Journey : పవర్ స్టార్ పవన్ కల్యాణ్... ఈ పేరు వింటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయి. మూవీస్‌లో ఆయన స్టైల్, మేనరిజం, పవనిజం అన్నీ వేరే లెవల్. అందుకే కోట్లాది మంది ఆయన్ను ఆరాధిస్తుంటారు. ఇక మార్షల్ ఆర్ట్స్‌లో ఆయనకున్న ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పుడెప్పుడో వచ్చిన తమ్ముడు మూవీ నుంచి నిన్నటి OG వరకూ యాక్షన్ సీక్వెన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
కొన్ని సినిమాల్లో పవన్ రియల్‌గానే పవన్ సాహసాలు చేశారు. తమ్ముడు, జానీ, బద్రి వంటి మూవీస్‌లో ఆయన ఫైట్స్ విన్యాసాలు అప్పట్లో యూత్‌ను ఉర్రూతలూగించాయి. మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకోవడమే కాకుండా ప్రతీ మూవీకి ప్రత్యేకంగా సాధన చేసేవారు. రీసెంట్‌గా వచ్చిన గ్యాంగ్ స్టర్ డ్రామా 'OG' కోసం కటానాతో ఫస్ట్ టైమ్ ఫుల్ ఫ్లెడ్జ్ యాక్షన్ సీన్స్ చేశారు. ఈ మూవీలో ఆయన ఫైట్స్, యాక్టింగ్, ఎలివేషన్ సాటి పవన్ అభిమాని ఆయన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలానే ఉంది.
రిమైండ్ ద డేట్
పవన్ కల్యాణ్ హోం ప్రొడక్షన్స్ 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్' స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన పాలిటిక్స్‌లోకి వెళ్లిన తర్వాత చాలా కాలం దీనికి విరామం వచ్చింది. తాజాగా దీని నుంచి వచ్చిన ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ నెల 7 నుంచి పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో ఓ 'కొత్త దశ' (New Chapter) ప్రారంభం కానుందనేది ఆ పోస్టర్ సారాంశం.
ఆ పోస్టర్‌లో జపాన్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఎర్రటి సూర్యుడు దాని ముందు పొడవైనా కటానా కత్తి ఉన్నాయి. ఈ క్రమంలో ఆ రోజు నుంచి పవన్ మార్షల్ ఆర్ట్స్ న్యూ జర్నీ ఏంటా అనేది సస్పెన్స్ నెలకొంది. ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు నుంచి పవన్ మార్షల్ ఆర్ట్స్ జర్నీలో కీలక ఘట్టాలను పోస్ట్ చేస్తారని కొందరు అంటుండగా... మరికొందరు న్యూ సినిమా గురించేమో అంటూ డౌట్ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ 'న్యూ చాప్టర్' ఏంటా అనేది ఆసక్తికరంగా మారింది.
A New Chapter.
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) January 5, 2026
Instagram - https://t.co/DNMsZdzGiw
Facebook - https://t.co/wG2cTggRpS
YouTube - https://t.co/nLeqGjxhHh pic.twitter.com/284bPNyjzW
Also Read : ప్రభాస్ 'ది రాజా సాబ్' క్లైమాక్స్ - మారుతి మ్యాక్స్ అంటూ తమన్ రియాక్షన్... ఫ్యాన్స్‌కు పండుగే
గతంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకునే యువత కోసం ఓ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తారంటూ ప్రచారం సాగింది. మరి ఈ పోస్టర్ దానికి సంబంధించినదేనా అనే టాక్ సైతం వినిపిస్తోంది. మరి ఈ సస్పెన్స్‌కు చెక్ పడాలంటే ఆ రోజు వరకూ వెయిట్ చేయాల్సిందే. ఇక OG తర్వాత పవన్ న్యూ ఇయర్ సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఆయన హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీ రాబోతోంది. పవన్ కెరీర్‌లో ఇది 32వ చిత్రం కాగా... వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నారు.






















