Dhurandhar OTT : ఓటీటీలోకి 1200 కోట్ల బ్లాక్ బస్టర్ 'ధురంధర్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Dhurandhar OTT Platform : గతేడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'ధురంధర్' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.

Ranveer Singh's Dhurandhar Movie OTT Release Date Locked : గతేడాది బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన బాలీవుడ్ మూవీ 'ధురంధర్'. రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రికార్డులు తిరగరాసింది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తక్కువ టైంలోనే రికార్డు కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
'ధురంధర్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుండగా... ఈ నెల 30 నుంచి మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు నేషనల్ మీడియా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. అయితే, దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
రికార్డు కలెక్షన్స్
ఈ మూవీ ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. త్వరలోనే రూ.1300 కోట్ల మార్క్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియావ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఫస్ట్ హిందీ మూవీగా నిలిచింది. బాలీవుడ్‌లో ఏ ఇతర మూవీకి సాధ్యం కాని ఫీట్‌ను తక్కువ టైంలోనే సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఈ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి వస్తుండడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
Also Read : మహేష్, రాజమౌళి 'వారణాసి' రిలీజ్ డేట్ ఫిక్స్! - 'శ్రీరాముడు' వచ్చేది ఎప్పుడంటే?
ఈ మూవీలో రణవీర్‌తో పాటు బాలీవుడ్ లెజెండ్స్ అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మలయాళ స్టార్ ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడీ, నవీన్ కౌశిక్, డానిష్ పండోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా మూవీని నిర్మించాయి. ఈ మూవీకి సీక్వెల్ రెడీ అవుతుండగా మార్చి 19న రిలీజ్ కానుంది.
స్టోరీ ఏంటంటే?
1999లో జరిగిన విమాన హైజాక్, 2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్ర దాడి ఘటన తర్వాత భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (ఆర్ మాధవన్) దేశ భద్రత కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. పాక్‌లో ఉగ్ర స్థావరాలపై దాడి చేయడం సహా ఉగ్ర సంస్థల్ని సమూలంగా ధ్వంసం చేసేలా ఆపరేషన్ 'ధురంధర్' పేరుతో ఓ సీక్రెట్ మిషన్ చేపట్టేందుకు ప్లాన్ చేస్తాడు.
ఇందులో భాగంగా దాయాది దేశంలోకి ఇండియన్ ఏజెంట్‌ను సీక్రెట్‌గా పంపాలని పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న యువకుడు హమ్జా (రణవీర్ సింగ్)ను సెలక్ట్ చేసుకుంటాడు. మారుపేరుతో అతన్ని పాక్‌లోకి పంపుతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? పాక్‌లో సీక్రెట్ ఏజెంట్ ప్రయాణం ఎలా సాగింది? కరాచీ అడ్డాగా ఉగ్రవాద ముఠాల్ని పెంచి పోషిస్తున్న రెహమాన్ బలోచ్ (అక్షయ్ ఖన్నా)ను హమ్జా ఎలా అంతం చేశాడు? ఉగ్ర ముప్పు నుంచి దేశాన్ని ర క్షించేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు? సన్యాల్ అతన్నే ఎందుకు మిషన్ ఏజెంట్‌గా ఎంచుకున్నాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.






















