Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
Jana Nayagan OTT Platform : విజయ్ 'జన నాయగన్' ఈ నెల 9న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, రిలీజ్‌కు ముందే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

Vijay's Jana Nayagan OTT Release Date Locked : కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ 'జన నాయగన్' ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఆయన లాస్ట్ మూవీ ఇదేనని ప్రకటించడంతో ఫ్యాన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకోగా... మూవీ రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అటు, సోషల్ మీడియాలోనూ దళపతి ఫ్యాన్స్ సందడి అంతా ఇంతా కాదు. ఈ నెల 9న సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
అయితే, తాజాగా ఈ మూవీ గురించి లేటెస్ట్ బజ్ వైరల్ అవుతోంది. రిలీజ్‌కు ముందే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆంగ్ల మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి.
స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకోగా... రిలీజ్ అయిన నెల రోజుల తర్వాతే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అంటే ఫిబ్రవరి రెండో వారంలో ఓటీటీలో మూవీ అందుబాటులోకి రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఏ మూవీ అయినా రిలీజ్ అయి థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వస్తుంది. విజయ్ మూవీ రిలీజ్‌కు ముందే ఓటీటీ రిలీజ్ డేట్ సైతం ఫిక్స్ చేసుకుందనే టాక్ వినిపిస్తోంది.
Also Read : జన నాయగన్ Vs పరాశక్తి - 'నేను షాక్ అయ్యా' అంటూ శివకార్తికేయన్ రియాక్షన్
ఈ మూవీ బాలయ్య 'భగవంత్ కేసరి'కి రీమేక్ అంటూ ప్రచారం సాగగా... తాజా ట్రైలర్‌లో అది కొంచెం రియల్ అని తేలిపోయింది. తండ్రీ కూతుళ్ల మధ్య ఎమోషన్, ఫోబియా ఉన్న కుమార్తెను దాని నుంచి బయటపడేసేందుకు తండ్రి ఏం చేశాడు? దీంతో పాటే పొలిటికల్ టచ్ కూడా ఇచ్చారు. అలాగే పోలీస్ ఆఫీసర్‌గానూ విజయ్ అదరగొట్టాడు.
ఈ మూవీ హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా... విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే మమితా బైజు, ప్రియమణి, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నరైన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మించగా... అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు.






















