అన్వేషించండి

Sudha Chandran : పూనకంతో ఊగిపోయిన సీనియర్ హీరోయిన్ - భక్తుడి చేతిని కొరుకుతూ వింత ప్రవర్తన... వీడియో వైరల్

Sudha Chandran Trance : సీనియర్ నటి, ఫేమస్ డ్యాన్సర్ సుధా చంద్రన్ ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పూనకంతో ఊగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Sudha Chandran Spiritual Trance Video Gone Viral : సీనియర్ నటి సుధా చంద్రన్‌ ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పూనకంతో ఊగిపోతూ వింతగా ప్రవర్తించినట్లుగా ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవీ భజన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఆధాత్మిక పారవశ్యంలో మునిగిపోయి ట్రాన్స్‌లోకి వెళ్లిపోయారు. 

కంట్రోల్ చేసేందుకు యత్నించినా...

ఎరుపు, తెలుపు రంగు చీర ధరించిన సుధా చంద్రన్... నుదుటిన 'జై మాతాజీ' అని రాసి ఉన్న బ్యాండ్ కట్టుకుని ఒక్కసారిగా గెంతుతూ పూనకంత ఊగిపోయారు. ఆమె ప్రవర్తన చూసిన తోటి భక్తులు ఆశ్చర్యపోయి కంట్రోల్ చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఓ భక్తుని చేయి కొరుకుతూ ఉన్నట్లు కనిపించింది. ఇతర భక్తులు ఆమెను గట్టిగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా... నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కొందరు సుధా చంద్రన్ ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోయి అలా ప్రవర్తించారని కామెంట్స్ చేస్తుండగా... మరికొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లుగా కామెంట్స్ చేశారు. భక్తి పారవశ్యంలో ఉన్నప్పుడు ట్రాన్స్‌లో వెళ్లడం సహజమని.. అప్పుడు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియదని... సానుభూతి వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. 

Also Read : నిన్న విజయ్... నేడు అల్లు అర్జున్ - బన్నీని భయపెట్టేసిన ఫ్యాన్స్... భార్య చేతిని గట్టిగా పట్టుకుని...

క్లాసికల్ డ్యాన్సర్‌గా ఎందరి మనసులనో గెలుచుకున్న సుధా చంద్రన్... నటిగానూ పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రమాదంలో కాలు కోల్పయినా కృత్రిమ కాలితో డ్యాన్స్ చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఈమె స్టోరీ ఆధారంగానే తెలుగు 'మయూరి' సినిమాను తీశారు. అందులో ఈమెనే ప్రధాన పాత్రలో నటించారు. అప్పట్లో ఈ మూవీ ఓ సంచలనం. తమిళంతో పాటు హిందీ, తెలుగు, మలయాళం భాషల్లో పలు సినిమాల్లో నటించారు. 

సినిమాల తర్వాత పలు టీవీ సీరియళ్లలోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 'నాగిన్' సీరియల్ ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇందులో యామిని రహేజా అనే పవర్ ఫుల్ నెగిటివ్ రోల్‌లో నటించి మెప్పించారు. హిందీలో సూపర్ హిట్ సీరియళ్లలో నటించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
Shakeela Warning : షకీలాకు సర్జరీ - అసలు రీజన్ ఏంటో తెలుసా?
షకీలాకు సర్జరీ - అసలు రీజన్ ఏంటో తెలుసా?
Sukriti Veni : ఫస్ట్ మూవీతో నేషనల్ అవార్డు - ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యూజిక్ స్కాలర్షిప్... సుకుమార్ కుమార్తె సుకృతి ఘనత
ఫస్ట్ మూవీతో నేషనల్ అవార్డు - ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యూజిక్ స్కాలర్షిప్... సుకుమార్ కుమార్తె సుకృతి ఘనత
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Embed widget